Advertisement
Tamanna :-పెళ్లికి ఇది టైమ్ కాదంటున్న తమన్నా
Bollywood Latest Movies Tollywood

Tamanna :-పెళ్లికి ఇది టైమ్ కాదంటున్న తమన్నా

Advertisement

నాయికల షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. రెండు మూడేళ్ల నుంచి మహా అయితే ఐదారేళ్ల దాకా హీరోయిన్స్ సినిమాలు చేస్తుంటారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవారూ ఉంటారు. కానీ అరుదుగా తమన్నా లాంటి కొందరు నాయికుల ఏళ్లకేళ్లు ఇండస్ట్రీని ఏలేస్తుంటారు. తమన్నా ముందు తమన్నా తర్వాత అనేక మంది హీరోయిన్స్ వచ్చి ఫేడవుట్ అయ్యారు. తను మాత్రం ఒక క్లాసిక్ లా ఉండిపోయింది. ఇలా క్రేజ్ ఉన్నంత కాలం ఎందుకు కాదనుకోవడం అనేది మిల్కీ బ్యూటీ తమన్నా ఆలోచన. అందుకే అప్పుడే పెళ్లి ఆలోచన లేదని చెబుతోంది.

ఆగడు లాంటి ఫ్లాప్స్ తర్వాత క్రేజ్ పడిపోయినా, బాహుబలి రెండు భాగాల తర్వాత నేషనల్ వైడ్ గా తమన్నా క్రేజ్ పెరిగింది. ఈ క్రేజ్ తో సౌత్ మొత్తంలో పుంజుకుంది తమన్నా. సినిమాల్లో నాయికగా నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. కేజీఎఫ్ లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ కు బాగా పేరొచ్చి, ఎంతోమంది ఫిలింమేకర్స్ అలాంటి సాంగ్స్ తమన్నాతో చేయిస్తున్నారు. అయితేే కొన్నింటికి మాత్రమే ఓకే చెబుతోందీ నాయిక. ఇలా ఇటు సినిమాలు అటు స్పెషల్ నెంబర్స్ చేస్తూ బిజీగా ఉంటే ఈ కెరీర్ అంతా కాదనుకుని పెళ్లి చేసుకోవడం ఏంటి అని తమన్నా క్లారిటీగా ఉంది.

ఈ మధ్య తమన్నా పెళ్లి గురించి చాలా వార్తలు వస్తున్నాయి. వాటిపై తమన్నా స్పందిస్తూ..మరో రెండేళ్ల దాకా నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పింది. తీరికలేనంత పని ఉంది, కెరీర్ చాలా బీజీగా సాగుతోంది. ఇలాంటి టైమ్ లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతాయి. అని చెప్పింది. ప్రస్తుతం తమన్నా.. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో పాటు రెండు కన్నడ సినిమాల్లోనూ నటిస్తుంది. దటీజ్ మహాలక్ష్మి, ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో హీరోయిన్​గా చేస్తోంది. వరుణ్​తేజ్ ‘గని’ చిత్రంలో స్పెషల్ సాంగ్​లో అదిరిపోయే డాన్సులు చేసింది. ఇంకొన్ని క్రెేజీ ప్రాజెక్ట్స్ కూడా తమన్నా విష్ లిస్టులో ఉన్నాయట. త్వరలో వాటి వివరాలూ చెబుతానంటోందీ బ్యూటీ.

Advertisement

Post Comment