మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌ టైనర్ ”ధమాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్  గ్రాండ్ నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ధమాకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా మాస్ మీట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. మాస్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ధమాకాలో పని చేసిన టెక్నిషియన్స్ అందరికీ  కంగ్రాట్స్. ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ థాంక్స్. అద్భుతమైన వర్క్ చేశారు. డీవోపీ కార్తిక్ ఘట్టమనేని ఎక్స్ లెంట్ విజువల్స్ ఇచ్చారు. సినిమాలో అందరం అందంగా వున్నామంటే దానికి ప్రధాన కారణం కార్తిక్ కెమరాపనితనం. ఈ సినిమా విజయానికి మొట్టమొదటి కారణం.. మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో. సాలిడ్ సౌండ్ ఇచ్చాడు. ఈ సినిమా తో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు. ధమాకా సక్సెస్ కి రెండో కారణం .. పీపుల్స్ మీడియా మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం, వారి పాజిటివిటీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు అద్భుతమైన వ్యక్తులు. చాలా పాజిటివ్ గా వుంటారు. ఈ బ్యానర్ ల