గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ థియేటర్స్ లో మాస్ జాతర సృష్టించిందిబ్లాక్ బస్టర్ దర్శకుడు వివి.వినాయక్ దర్శకత్వంలో సెప్టెంబర్ 25,2002లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది.‘చెన్నకేశవ రెడ్డి’ మాస్ జాతర ఖండాంతరాలు దాటి 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గని ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్త హంగులతో రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత బెల్లం కొండ సురేష్. ఈ నేపధ్యంలో దర్శకుడు వివి.వినాయక్ తో కలసి విలేఖరుల సమవేశం నిర్వహించి రీరిలీజ్ విశేషాలని పంచుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ‘చెన్నకేశవ రెడ్డి’ని భారీగా రీరిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇరవైఏళ్ల కిందట ఎంత హైబడ్జెట్ తో, క్రేజీగా ఈ సినిమా నిర్మించామో, అంతే క్రేజీగా ఇప్పుడు సినిమా రీరిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులందరూ మళ్ళీ చూసి అదే థ్రిల్ ఫీలౌతారని నమ్ముతున్నాను. రీరిలీజ్ గురించి బాలకృష్ణ గారికి చెప్పగానే ఆయన సపోర్ట్ ని తెలిజేశారు. ఆ రోజుల్లో వినాయక్ ఒక పూనకం వచ్చేలాగా సినిమా తీశారు. యాక్షన్, చేజ్, సుమోలు, హెలీ క్యాప్టర్లు, భారీగా జనాలు.. అంతా ఒక అద్భుతంలా వుంటుంది ‘చెన్నకేశవ రెడ్డి’. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికీ ఒక గొప్ప థ్రిల్ ఇచ్చే సినిమా అవుతుంది. ఎక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసినా ఒక అరగంటలో ఫుల్ అయిపోయి మళ్ళీ షోలు పెంచే పరిస్థితి వుండటం గొప్ప ఎనర్జీ ఇస్తుంది. సెప్టెంబర్ 24న ప్రిమియర్ షోలతో మొదలుపెట్టి,25న రెగ్యులర్ షోలు వుంటాయి.  రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 300 థియేటర్స్ లో సినిమాని ప్రదర్శిస్తున్నాం. రీరిలీజ్ లో ఒక సినిమాని కోటి రూపాయిలకి అడిగినా దాఖలాలు ఎక్కడా లేవు. క