సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజుల క్రితమే ఆయన మొదటి భార్య ఇందిరా దేవి గారు కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరితనం తో బాధపడుతున్నారాయన. మరో వైపు వయోభారం కూడా కారణం కావడం తో అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
చాల రోజుల క్రితమే నటనకు స్వస్తి పలికారు కృష్ణ గారు.


తెలుగు సినిమా చరిత్ర వరకు ఆయనది ఒక సాహసోపేతమైన అధ్యాయం. తెలుగు సినిమా కు కృష్ణ అనే నటుడు దొరకడమే ఒక వరం. వరాల బిడ్డగానే తరాలకూ తరిగి పోనీ ఖ్యాతిని సంపాదించి పరిశ్రమకు ఎన్నో హంగులను అద్దారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, ఎడిటర్ గా ఆయన అందించిన సేవలు ఎనలేనివి. వ్యక్తి గా ఒక్క మచ్చ కూడా లేని స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. సూపర్ స్టార్ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం. తన వారసుడుగా మహేష్ బాబును ఇచ్చి.. కొడుకు స్టార్డం ఆనందిస్తోన్న ది రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారు సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది తెలుగు ౭౦ఎం.ఏం.

, , ,