సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణం ఫ్యాన్స్ ను పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. వయోభారంతో ఉన్నట్టు కనిపించినా.. మరీ ఇంత మరణించేంత అనారోగ్యంతో ఉన్నారన్న విషయం ఆయన పోయేంత వరకూ ఎవరికీ తెలియదు. అయితే కృష్ణ మరణం తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఆనందాన్ని బాధను ఇచ్చాయి. ఆయన మరణించిన తర్వాత జరిగిన వీడ్కోలు ఈ మధ్య కాలంలో మరే నటుడికీ దొరకలేదు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ గవర్నర్, మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులెందరో వచ్చి ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. ఇది అభిమానులకు ఆనందాన్నిచ్చింది. అయితే అలాంటి గొప్ప నటుడి అంత్య క్రియలను సాధారణంగా మహా ప్రస్థానంలో పూర్తి చేయడం బాధంచింది. ఈ విషయంలో చాలామంది రకరకాలు గా మాట్లాడుకున్నారు కూడా.

కానీ అది ఆయనే కోరుకున్నారు అనే వాదనా ఉంది. బట్.. ఓ మంచి స్మృతివనం ఉంటే బావుండేది అనేది దాదాపు అందరూ వెలిబుచ్చిన అభిప్రాయం. ఎవరి ఫీలింగ్ వారికి ఉన్నా.. మహేష్‌ ఫ్యామిలీ ఆల్రెడీ ఓ మంచి నిర్ణయంతోనే ఉంది. ఇప్పటి వరకూ ఏ నటుడుకీ, రాజకీయ నాయకుడికీ లేనంత గొప్పగా.. కృష్ణ గారి స్మృతివనం రూపొందించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.


ఇప్పటికే కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఆ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్టించాలి అనే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు కానీ.. ఈ స్థలం మాత్రం రాబోయే రోజుల్లో సైతం ఆయన గొప్పదనం తెలిసేలా ఉండబోతోందంటున్నారు. ఆయన కాంస్య విగ్రహంతో పాటుగా ఆయన నటించిన 350ల సినిమాలకు సంబంధించిన విశేషాలు..

ప్రత్యేక చిత్రాలకు అందుకున్న అవార్డులు, రివార్డులు, ఆయన మాత్రమే సాధించిన అంశాలకు సంబంధించిన షీల్డ్స్ ను ప్రదర్శనకు ఉంచబోతున్నారట. ఇలా ఇప్పటి వరకూ ఏ నటుడికీ జరగలేదు. అందుకే ఆ దిశగా మహేష్‌ బాబు ఫ్యామిలీ ఆలోచన చేసిందంటున్నారు. అతి త్వరలోనే ఈ స్మృతివనంకు సంబంధించి స్థలాన్ని ఫైనల్ చేసి ప్రకటించబోతున్నారు. ఏదేమైనా ఒన్స్ ఏ సూపర్ స్టార్ ఈజ్ ఆల్వేస్ ఏ సూపర్ స్టార్.

, , , , , , , , , , , , ,