Advertisement
తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్ ని క‌లిసిన సుకుమార్, అల్లు అర‌వింద్
Latest Movies Tollywood

తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్ ని క‌లిసిన సుకుమార్, అల్లు అర‌వింద్

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర‌వింద్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుండ‌డం విశేషం. బాలీవుడ్ ట్రేడ్ పండితుల‌కు సైతం పుష్ప క‌లెక్ష‌న్స్ షాక్ ఇస్తున్నాయంటే.. ఏ రేంజ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.

ఇదిలా ఉంటే.. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, పుష్ప డైరెక్ట‌ర్ సుకుమార్ రాజ్ భ‌వ‌న్ లో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర్య‌రాజ‌న్ ని క‌లిసి పుష్ప సినిమా చూడ‌మ‌ని కోరారు. అనంత‌రం ద‌ర్శ‌కుడు సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప సినిమా చూడ‌మ‌ని అడ‌గ‌డం కోస‌మే గ‌వ‌ర్న‌ర్ గారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాం. అంత‌కు మించి ఏమీ లేదు. ఇత‌ర విష‌యాల గురించి ఎలాంటి ప్ర‌స్తావ‌న రాలేదు. త్వ‌ర‌లోనే చూస్తాన‌ని చెప్పారు. ఎప్పుడు చూస్తారు అనేది చెప్ప‌లేదు అన్నారు.

Advertisement