Advertisement
వైర‌ల్ గా మారిన సుడిగాలి సుధీర్ ఎంగేజ్ మెంట్.
Latest Movies Tollywood

వైర‌ల్ గా మారిన సుడిగాలి సుధీర్ ఎంగేజ్ మెంట్.

Advertisement

సుడిగాలి సుధీర్, యాంకర్ ర‌ష్మి.. వీరిద్ద‌రూ బుల్లితెర పై ఎంత ఫేమ‌సో అంద‌రికీ తెలిసిందే. వీరిద్ద‌రూ బుల్లితెర పై క‌నిపిస్తే చాలు.. అల్ల‌రే అల్ల‌రి. ఒక‌టే.. సంద‌డి. స్మాల్ స్ర్కీన్ పై వీళ్లిద్ద‌రి కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. అందుక‌నే వీక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకోవ‌డం కోసం వీరిద్ద‌రితో ర‌క‌ర‌కాల పొగ్రామ్స్ చేస్తుంటారు. వీళ్ల రొమాన్స్ చూస్తే.. నిజంగానే ల‌వ్ లో ఉన్నారా..? త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటారా..? అనిపిస్తుంటుంది. అంత‌లా వీరిద్ద‌రూ షోను ర‌క్తి క‌ట్టిస్తుంటారు.

గ‌తంలో…ఓ షో కోసం వీళ్లిద్ద‌రు పెళ్లి చేసుకున్న‌ట్టుగా ఓ పొగ్రామ్ కూడా చేశారు. ఆ షోలో ఉన్న అతిధులంద‌రూ అక్షింత‌లు వేసి ఆశీర్వ‌దించారు. ఇన్నాళ్లు ప్రేమ‌జంట‌గా ప్ర‌చారం పొందిన సుడిగాలి సుధీర్ – జ‌బ‌ర్థ‌స్త్ ర‌ష్మి సీరియ‌స్ గానే పెళ్లి చేసుకున్నారా అనిపించింది. ఆత‌ర్వాత తెలిసింది సీరియ‌స్ గా కాకుండా సిల్లీగా వివాహం చేసుకున్నార‌ని. ఆత‌ర్వాత ఈ సిల్లీ మ్యారేజ్ వీడియో అండ్ ఫోటోస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డం తెలిసిందే.

ఇప్పుడు సుడిగాలి సుధీర్.. ఇంద్ర‌జ‌ల ఎంగేజ్ మెంట్ జ‌రిగింది. ఈసారి కూడా సీరియ‌స్ గా కాదండోయ్… సిల్లీగానే. అయితే.. ఈసారి ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే పొగ్రామ్ కోసం చేసుకున్నాడు. ఈ షోకు సంబంధించిన ప్రొమో రిలీజ్ చేశారు. ఈ ప్రొమో చూస్తుంటే.. నిజంగానే ఎంగేజ్ మెంట్ జ‌రిగిందా..? అన్న‌ట్టుగా ఉంది. ఎంట‌ర్ టైనింగ్ ఉన్న ఈ ప్రొమో విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వ‌ర‌లోనే ఈ షో ప్ర‌సారం కానుంది. బుల్లితెర పై ఎంగేజ్ మెంట్లు.. మ్యారేజ్ లు చేసుకుంటున్నాడు. మ‌రి.. నిజ జీవితంలో సుధీర్ ఎవ‌ర్ని చేసుకుంటాడో..? ఎప్పుడు చేసుకుంటాడో..?

Advertisement