ad

స్టార్ హీరోలతో సినిమాలంటే మాటలు కాదు అనుకుంటారు చాలామంది. కానీ అదేమంత గొప్ప కాదంటోంది నేటి తరం. పైగా ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకుని నానా హంగామాలు యాడ్ చేస్తూ అవే గొప్పగా చూపించేస్తూ ఆ హీరోలను బుట్టలో వేసుకుంటున్నారు. సదరు హీరోలూ అంతే. కథ ఎంత బలంగా ఉంది అనేకంటే ఎన్ని ఎలివేషన్లున్నాయి అనేదే చూస్తున్నారా అనిపిస్తోంది ఈ మధ్య వస్తోన్న సినిమాలు చూస్తోంటే. ముఖ్యంగా తమిళ్ చిత్రాలు. నిన్నటికి నిన్న బీస్ట్ తో ప్రేక్షకులతో ఓ ఆట ఆడుకున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్. ఇతకు ఇంతకు ముందు నయనతారతో కొలమావు కోకిల, శివకార్తికేయన్ తో వరుణ్ డాక్టర్ అనే చిత్రాలు తీశాడు. రెండూ డిఫరెంట్ మూవీస్. దీంతో వెంటనే విజయ్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఓ బలహీమైన కథ, కథనాలతో విజయ్ అభిమానులకు కూడా చిర్రెత్తుకువచ్చే చిత్రం తీశాడు. దీనికంటే ముందు వచ్చిన అజిత్ సినిమా వలిమై.

ఈ చిత్రానికి దర్శకుడు హెచ్ వినోద్. ఇతను గతంలో కార్తీతో ఖాకీ చిత్రంతో పరిచయం అయ్యాడు. ఆ వెంటనే అజిత్ సినిమా నీర్ కొండపార్వై(బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ రీమేక్) బాధ్యతలు ఇచ్చాడు. బోణీకపూర్ నిర్మించిన సినిమా ఇది. ఈ చిత్రానికి అతని పనితనం నచ్చిన అజిత్ మరో ఛాన్స్ ఇచ్చాడు. వలిమై అనే పేరుతో వచ్చిన ఈ చిత్రం కూడా అత్యంత బలహీనమైన కథ, కథనాలతో ఉన్నదే. కానీ యాక్షన్ సీక్వెన్సులు మాత్రం హాలీవుడ్ ను తలదన్నేలా ఉన్నాయి. కేవలం యాక్షన్ సీన్ల కోసమే రిపీటెడ్ ఆడయన్స్ ఉన్నారు. కానీ కథ, స్క్రీన్ ప్లే రెండూ వీక్ అంటే వీక్. అలాంటి దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడు అజిత్.

విశేషం ఏంటంటే.. వలిమై తో పాటు ఈ చిత్రానికీ నిర్మాత బోణీకపూరే. అంటే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కలిసి హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నారన్నమాట. రీసెంట్ గా ఈ చిత్రం ఓపెనింగ్ కూడా జరుపుకుంది. హెచ్ వినోద్ పొటెన్సియల్ ఉన్న దర్శకుడే అని ఖాకీ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఆ పొటెన్సియల్ ను ప్రొలాంగ్ చేసుకోవాలంటే ప్రాపర్ స్టోరీ లైన్ ఉండాలి. కథనం పై కాస్త కాన్ సెంట్రేట్ చేయాలి. అవేవీ లేకుండానే ఏవో కొన్ని సీన్స్ పై డిపెండ్ అయితే డివైడ్ టాక్ నుంచి డిజాస్టర్ టాక్ గా మారడానికి ఎక్కువ టైమ్ పట్టదు.
మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ గా సౌత్ పూర్తిగా ఆశలు వదిలేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకుంటున్నారట. ప్రస్తుతం రకుల్ హిందీలో బాగా బిజీగా ఉంది. కానీ తను ఎదిగిన సౌత్ లో మాత్రం ఒక్క ఛాన్సూ లేదు. మరి తన ఖాకీ సినిమాలో నటించిందనే కారణంతో తీసుకుంటున్నాడో లేక అజిత్ సరసన సరిపోతుందనుకున్నారో కానీ.. ప్రస్తుతం రకుల్ తో చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఈ హ్యాట్రిక్ కాంబో ఈ సారి ఎలాంటి కంటెంట్ తో వస్తారో చూడాలి.

, , , , , , , , , , ,