శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై చిందనూరు విజయలక్ష్మి సమర్పణలో తెరకెక్కిన చిత్రం శ్రీరంగాపురం.వినాయక్ దేశాయ్, పాయెల్ ముఖర్జీ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చిందనూరు నాగరాజు నిర్మించారు. M.S. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం స్వర సుందరం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈచిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: శ్రీరంగాపురం గ్రామంలో పెద్దరెడ్డి (చిందనూరు నాగరాజు), కొండారెడ్డి(సత్య ప్రకాశ్) ల మధ్య పగ, ప్రతీకారాలు వుంటాయి. ఓ సారి గ్రామం విషయంలో కొండారెడ్డి ని.. పెద్దరెడ్డి ఘోరంగా అవమానిస్తాడు. దాంతో కొండారెడ్డి వూరికి దూరంగా నివసిస్తూ వుంటాడు. అయితే పెద్దిరెడ్డి.. తన మేనకోడలు మహాలక్ష్మి(పాయెల్ ముఖర్జీ)ని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఆమె అదే గ్రామానికి చెందిన పాలు అమ్ముకునే రంగ(వినాయక్ దేశాయ్) అనే యువకున్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో కొండారెడ్డి కుమారుడు సిద్ధూ (రోబో గణేశ్) మహాలక్ష్మిని ఇష్టపడతాడు. ఈ విషయం తెలిసి పెద్దరెడ్డి… పాలమ్ముకునే రంగకి తన మెనకోడలిని ఇవ్వడం కంటే తన కులానికి చెందిన.. పగవాడైన కొండారెడ్డి కుమారునికి ఇచ్చి పెళ్లి చేయడం వుత్తమం అని భావించి… కొండారెడ్డి ఇంటికి కోడలిని చేస్తాను అని మాటిస్తాడు. మరి పెద్దరెడ్డి … కొండారెడ్డి కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? మహాలక్ష్మి, రంగాల ప్రేమ ఎలా ముగిసింది తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కే కథలు ఎప్పుడూ ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. గ్రామాల్లో రెండు వర్గాల మధ్య వుండే పగలు, ప్రతీకారాలు… వాటి మధ్యలో ఓ అందమైన ప్రేమ కథ… ఆ ప్రేమ కథకు అడ్డు తగిలే విలన్… ఇలా ఇంట్రెస్టింగ్ కథ. కథనాలతో వచ్చే సినిమాలని ఆడియన్స్ బాగా ఆదరిస్తారు. తాజాగా ఎం.యస్. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరంగాపురం చిత్రం కూడా ఇలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న స్టోరీతో తెరకెక్కిందే. తండ్రి తరువాత తండ్రి లాంటి వాడు మేన మామ. అలాంటి మేనమామ తన మేనకోడలు ప్రేమ విషయంలో ఎలా వ్యవహరించాడు.. ఆమె ప్రేమను గెలిపించడానికి, తాను ఇతరులకు ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి వున్నాడు అనేది ఇందులో ఎంతో హృద్యంగా చూపించారు దర్శకుడు. ప్రతి మేన మామ తన మేనకోడలు పట్ల ఎలా వుండాలి అనేది ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు. సెంటిమెంట్, మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంతో నూతనంగా పరిచయమైన హీరో వినాయక్ దేశాయ్.. మంచి మాస్ కటౌట్ వున్నొడు. ఇందులో అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రేమ కథకి చక్కగా సూట్ అయ్యాడు. అతనికి జంటగా నటించిన పాయెల్ ముఖర్జీ గ్రామీణ యువతిగా లంగా ఓణీ లో మెప్పించింది. అలాగే యూత్ కి నచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ లోనూ బాగా ఆకట్టుకుంది. ఇద్దరికీ ఇదే తొలి సినిమా. మేన మామ గా పెద్దరెడ్డి పాత్రలో ఈ సినిమా నిర్మాత చిందనూరు నాగరాజు మాస్ సీన్స్ లో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే అతడు చేసిన మాస్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కూతురులా తన మేనకోడలిని ఎంతో ప్రేమించే మేన మామ గా… గ్రామంలో ప్రత్యర్థులకు సింహ స్వప్నంలా కనిపించి మెప్పించాడు. రెండు వేరియేషన్స్ లో బాగా అనుభవం వున్న నటుడిగా నటించాడు. విలన్ పాత్రలో సత్య ప్రకాశ్ తన దైన స్టైల్లో నటించాడు. అతని కొడుకుగా రోబో గణేశ్ సైకో పాత్రలో మెప్పించాడు. మిగతా పాత్రలలో చిత్రం శ్రీను, జబర్దస్త్ రాజమౌళి, శ్రావణ సంధ్య, వైష్ణవి సింగ్, గీతా సింగ్, దుర్గారావు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు వాసు రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. మాస్ ని మెప్పించే అన్ని అంశాలు ఇందులో వుండేలా చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగ చూపించారు. అలాగే హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ ని బాగా క్యాప్చర్ చేశారు. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకాస్త బాగుందాల్సింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు క్వాలిటీగా వున్నాయి. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3/5

, , , , , , , , , , ,