శాకిని డాకిని సినిమాలోని డైలాగ్ ఇది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఈ నెల 16న థియేటర్స్ లో విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. నిజానికి ఇది మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ మూవీకి అఫీషియల్ రీమేక్. సురేష్‌ బాబు నిర్మిస్తోన్న ఈ మూవీకంటే ముందు కూడా ఆయన ఓ బేబీ చిత్రాన్ని కొరియన్ నుంచే తీసుకున్నాడు. ఫీమేల్ ఓరియంటెడ్ గా కనిపిస్తోన్న శాకిని ఢాకిని చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేశాడని చెబుతున్నా.. అతను ప్రమోషన్స్ ఎక్కడా కనిపించడం లేదు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది.

లేటెస్ట్ గా వచ్చిన ఈ ట్రైలర్ సైతం ఇంప్రెసివ్ గానే ఉందని చెప్పాలి.”పోలీస్ ట్రెయినీస్ గా జాయిన్ అయిన ఇద్దరు అమ్మాయిల కథ ఇది. ట్రెయినింగ్ పీరియడ్ లో ఒకరంటే ఒకరికి అస్సలే పడదు. టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. అలాంటి ఈ ఇద్దరూ ఓ సారి రాత్రి బయటకు వెళ్లి వస్తుండగా కొందరు దుండగులు ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం చూస్తారు. వెంటనే వెళ్లి ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు ఆ కిడ్నాప్ ల వెనక ఓ పెద్ద ముఠా ఉందని తెలుస్తుంది.

ఆ ముఠా ఇలా కిడ్నాప్ చేసిన అమ్మాయిలను ఏం చేస్తుంది అనే కోణంలో వీరు డిపార్ట్ మెంట్ కు తెలీకుండా చేసిన దర్యాప్తులో షాకింగ్ ఇష్యూస్ తెలుస్తాయి. మరి అదేంటీ.. ఈ కిడ్నాపర్స్ ను శాకినీ ఢాకినీ పట్టుకున్నారా లేదా అనే కోణంలో సినిమా సాగుతుంది” అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సాధారణంగా ఏ సినిమా ట్రైలర్ లో అయిన మెయిన్ ప్లాట్ ను దాచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ను రివీల్ చేసి చేయనట్టుగా ఉంచుతారు. బట్ ఈ మూవీ ట్రైలర్ లో అన్నీ చెప్పేశారు. అంటే సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని వీరి ధైర్యం కావొచ్చు. లేదా స్క్రీన్ ప్లే మెప్పిస్తుందన్న నమ్మకం కావొచ్చు. ఏదేమైనా ఈ కిడ్నాప్ ముఠా ఆటకట్టించాలనే అర్థంలో ట్రైలర్ చివర్లో చెప్పిన ” అమ్మాయిని చూస్తే అమ్మోరు గుర్తుకు రావాల కొడుకులకు” అనే డైలాగ్ బావుంది. మరి ఈ నెల 16న చాలా సినిమాలు వస్తున్నాయి. అంత పోటీని తట్టుకుని ఈ శాకినీ ఢాకీనీ మెప్పిస్తారా లేదా అనేది చూడాలి.

, , , , ,