తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ‘నానే వరువెన్’ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి.ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది.”నేనే వస్తున్నా” పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది.తాజాగా ఈ చిత్రం నుండి “వీరా సూర ధీర రారా” పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటను చంద్రబోస్ రచించారు.

“వీరా సూర ధీర రారా
మతి బెదర
గతి చెదర
అడవంతా నీ అధికారం ఔరా”
లాంటి లైన్స్ ధనుష్ కి ఎలివేషన్ తో పాటు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ నంబియార్ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై  “కలైపులి ఎస్ థాను” నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.

, , , , , ,