పోర్న్ వీడియోస్ తో రాజ్ కుంద్రా ఎంత సంపాదించాడంటే
Bollywood Movies Trending News

పోర్న్ వీడియోస్ తో రాజ్ కుంద్రా ఎంత సంపాదించాడంటే

పోర్న్ వీడియోస్ ఫిల్మింగ్ కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాకు కోర్టు ఈ నెల 23 దాకా కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచి రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీలో ఉంటున్నారు. కస్టడీలో పోలీసులు రాజ్ కుంద్రా నుంచి పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారు. ఆయనకు ఈ పోర్న్ వీడియోస్ మేకింగ్ ఆలోచన ఎలా వచ్చింది, మోడల్స్ ను ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఈ వీడియోస్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ వివరాలు అటు పోలీసులను, ఇటు మీడియా ద్వారా జనాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ పోర్న్ వీడియోల ద్వారా రాజ్ కుంద్రా రోజుకు లక్షల్లో ఆదాయం పొందారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి బ్యాంక్ ఖాతాల నుంచి 7.5 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు.

దాదాపు ఏడాదిన్నరగా రాజ్ కుంద్రా ఈ పోర్న్ వీడియోల బిజినెస్ చేస్తున్నట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. లండన్ లో ఉండే తన బావ మరిది కంపెనీ కెన్రిన్ ద్వారా హాట్ షాట్ అనే యాప్ లో ఈ పోర్న్ వీడియోస్ అప్ లోడ్ చేస్తున్నారు. ఈ వీడియోలను ముంబైలో మోడల్స్ తో షూట్ చేయించి, వీ ట్రాన్స్ ఫర్ ద్వారా యూకేకి పంపిస్తున్నారు. న్యూడ్ సీన్స్ లో యాక్ట్ చేయాలని తమపై రాజ్ కుంద్రా టీమ్ ఒత్తిడి తెచ్చారంటూ కొందరు మోడల్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులను ఆశ్రయించారు. ఆ కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచే రాజ్ కుంద్రా, అతని టీమ్ పై ముంబై క్రైమ్ బ్రాంచ్ కన్నేసింది. కొన్ని కంప్లైంట్స్ వచ్చిన తర్వాత హాట్ షాట్స్ అనే మొబైల్ యాప్ ను గూగుల్, యాపిల్ ఐ ట్యూన్స్ తమ సర్వర్ నుంచి తొలగించాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన రాజ్ కుంద్రా కంటెంట్ మొత్తం బ్యాకప్ పెట్టుకున్నారు. ఆ బ్యాకప్ ఫైల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాట్ షాట్స్ బ్యాన్ అయ్యాక బాలీ ఫేమ్ పేరుతో మరో యాప్ తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు రాజ్ కుంద్రా.

సబ్ స్క్రైబ్ చేసుకుంటేనే హాట్ షాట్స్ పోర్న్ వీడియోస్ చూడొచ్చు, ఇలా వేల మంది అక్కౌంట్స్ నుంచి ఈ యాప్ కు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మొదట్లో ఈ పోర్న్ వీడియోల ద్వారా రాజ్ కుంద్రాకు రోజుకు 2-3 లక్షల రూపాయల ఆదాయం వచ్చేదని, తర్వాత ఆ మొత్తం 6-8 లక్షలకు పెరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇలా గత ఏడాది నుంచి రాజ్ కుంద్రాకు ఆదాయం బాగా పెరిగిందని, దానికి తగినట్లే కంటెంట్ కూడా పెంచుతూ వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అరెస్టయిన అందరి బ్యాంక్ ఖాతాలను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫ్రోజెన్ చేశారు. అలా 7.5 కోట్ల రూపాయల మేర డబ్బు స్తంభింపజేశారు. ఈ ఖాతాల్లో పోర్న్ వీడియోల్లో నటించిన మోడల్ గెహనా వశిష్ట బ్యాంక్ బ్యాలెన్స్ 37 లక్షల రూపాయలు కూడా ఉన్నాయి.

 

Post Comment