దిగివచ్చిన మంగ్లీ వివాదంపై తొలిసారి నోరువిప్పిన సింగర్‌….!!
Social Media Tollywood Trending News

దిగివచ్చిన మంగ్లీ వివాదంపై తొలిసారి నోరువిప్పిన సింగర్‌….!!

బోనాల పాట వివాదంపై ప్రఖ్యాత ఫోక్‌ కమ్‌ టాలీవుడ్‌ సింగర్‌ మంగ్లీ స్పందించింది.. బోనాల సందర్భంగా విడుదలయిన అమ్మవారి పాటలోని కొన్ని పదాల ప్రయోగంపై వివాదం రేగుతోంది.. సెట్టు కింద కూర్చున్నవమ్మా.. మోతేవరిలాగా.. అనే పదాలను ఉపయోగించడంపై అనేక మంది సాహితీ వేత్తలు, తెలంగాణ జానపద కళాకారులు, అమ్మవారి భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. దీనిపై కొన్ని రోజులు సైలెంట్‌ గా ఉన్న మంగ్లీ.. వివాదం మరింత ముదురుతుండడంతో మొదట పాటలోని వివాదాస్పద పదాలను మారుస్తూ కొత్త పాటను తన యూ ట్యూబ్‌ చానెల్‌ లో అప్‌ లోడ్‌ చేసింది.. అయినా దుమారం తగ్గకపోవడంతో తాజాగా నోరు విప్పింది.. తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా వివరణ ఇచ్చింది..

మంగ్లీ పాటపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.. అమ్మవారిని దూషించారని, ఆమెపై హైదరాబాద్‌ మల్కాజ్‌ గిరి కార్పొరేటర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.. అమ్మవారిని నిందాస్తుతి పేరుతో అభ్యంతరకర పదాలు ప్రయోగించారని ఆక్షేపించారు.. ఈ వివాదంపై తాజాగా మంగ్లీ రియాక్ట్‌ అయింది..

ఈ వివాదం తనకు తెలియకుండానే జరిగిందని అర్దం వచ్చేలా వివరణ ఇచ్చింది సింగర్‌ మంగ్లీ.. తాను పండితుల కుటుంబం నుండి రాలేదని, గిరిజన ప్రాంతం నుండి వచ్చానని తెలిపింది.. తాము గ్రామ దేవతలను పూజిస్తామని, అమ్మవారిని కొలుస్తామని వివరించింది మంగ్లీ.. అంతేకాదు, తమ తండాలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నామని వ్యాఖ్యానించింది..

అంతేకాదు, ఈ తాజా వివాదంలో పాటను రచించిన రామస్వామి.. అమ్మవారిపై గత 30 ఏళ్లుగా అనేక పాటలను రచించారని గుర్తు చేసింది.. ఆయన ఇప్పటివరకు అమ్మవారిపై సుమారు 300 పాటలను రాశారని వివరించింది.. మోతేవరి అంటే అర్ధం గ్రామ పెద్ద అని, ఈ పద ప్రయోగంలో తప్పేమీ లేదని తన భావనగా అభిప్రాయ పడింది మంగ్లీ.. మరోవైపు, ఈ పాటలోని సాహిత్యాన్ని మార్చడంపై కూడా వివరణ ఇచ్చింది.. రామస్వామి కుటుంబ సభ్యుల అనుమతితోనే సాహిత్యాన్ని మార్చానని తెలిపింది ఫోక్‌ సింగర్‌ మంగ్లీ.. మరోవైపు, తన స్థానికత, జాతిపై

మొత్తమ్మీద, మంగ్లీ వివరణతో బోనాల పాట వివాదం సద్దుమణిగే చాన్స్‌ కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. మరి, ఈ వివాదం ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో చూడాలి..

Post Comment