మంగ్లీ చేసిన తప్పేంటి..?? ఆమె జోలికి వస్తే…. యువ రచయితల వార్నింగ్‌…..!!
Social Media Tollywood Trending News

మంగ్లీ చేసిన తప్పేంటి..?? ఆమె జోలికి వస్తే…. యువ రచయితల వార్నింగ్‌…..!!

ప్రఖ్యాత ఫోక్‌ సింగర్, టాలీవుడ్‌ వర్దమాన గాయని మంగ్లీ చుట్టూ కొత్త వివాదం రాజుకుంది. బోనాల పండుగ సందర్భంగా ఆమె పాడి, నర్తించిన పాట కాంట్రవర్శీగా మారుతోంది.. ఈ పాటలో ఆమె అమ్మవారిని నిందస్తుతి చేస్తూ చేసిన పద ప్రయోగాలు వివాదానికి కేరాఫ్‌ గా మారుతున్నాయి. సెట్టుకింద కూర్సుంటివమ్మా… మోతువారిలాగా అనే పద ప్రయోగాలపై హిందూ మత సంఘాలు మండిపడుతున్నాయి.. అమ్మవారిపై పాటపాడుతూ ఇలాంటి పద ప్రయోగాలు చేయడం ఏంటని విరుచుకుపడుతున్నారు..

హైదరాబాద్‌ మల్కాజ్‌ గిరి కార్పొరేటర్‌ మంగ్లీ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. హిందూ దేవతలను అవమానిస్తున్నారని, కించపరుస్తున్నారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలిన కోరారు.. దీంతో, మంగ్లీ వివరణ ఇచ్చింది..

ఈ ఫిర్యాదుకు ముందే సోషల్‌ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు తలెత్తడంతో తన పాట లిరిక్స్‌ ని మార్చారు మంగ్లీ.. అయితే, పాత పాటని సైతం కొంతసేపు కొనసాగించింది ఆమె యూ ట్యూబ్‌ చానెల్‌.. మొదట దానిని డిలీట్‌ చేయలేదు.. ప్రయివేట్‌ కూడా చేయలేదు.. దీంతో, మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి హిందూ మత సంఘాలు.. వివాదం మరింత ముదురుతుండడంతో వెనక్కి తగ్గిన మంగ్లీ యూ ట్యూబ్‌ చానెల్‌ యాజమాన్యం.. దానిని ప్రయివేట్‌ చేసినట్లు తెలుస్తోంది..

మరోవైపు, అమ్మవారిపై తాను పాడిన పాట వివాదంపై మంగ్లీ స్పందించింది.. పాట రాసిన రామస్వామి గత ఇరవై ఏళ్లుగా అమ్మవారిపై 300 పాటలు రాశారని వివరించింది.. రామస్వామి కుటుంబం అనుమతితో పాట లిరిక్స్‌ ని మార్చామని మంగ్లీ తెలిపారు..

తన జాతి, ప్రాంతీయతపై కొందరు కావాలనే వివాదం చేస్తున్నారని మండిపడ్డారు మంగ్లీ.. తనకు అమ్మవారిపై విపరీతమైన భక్తి అని చెప్పుకొచ్చారు.. ఇటు, తన కుటుంబం తన తండాలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించిందని, అక్కడ నిత్యం పూజలు చేస్తామని తెలిపారు ఫోక్‌ సింగర్‌ మంగ్లీ..

ఆమె వివరణపై హిందూ మత సంఘాలు సంతృప్తి చెందడం లేదు.. ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు కొందరు.. మంగ్లీ వివరణ ఇచ్చినా వెనక్కి తగ్గకపోవడంపై ఆమె మద్దతుదారులు మండిపడుతున్నారు.. ఆమె జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు మంగ్లీ సపోర్టర్స్‌.. అత్యంత తక్కువ స్థాయినుండి వచ్చిన ఆమె ఎదుగుదలను సహించలేక కొందరు నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించమని, మంగ్లీకి మద్దతుగా బహుజన సంఘాలు ఏకం అవుతాయని తెలిపారు ప్రముఖ రచయిత పసునూరి రవీందర్‌.. మంగ్లీకి మద్దతుగా తాము నిలబడతామని తెలిపారు..
మొత్తమ్మీద, అమ్మవారి పాటపై మంగ్లీ పాడి, నర్తించిన పాట కాంట్రవర్శీకి కేరాఫ్‌ గా మారుతోంది.. దీనిపై పోలీసుల కేసుకు వెళ్లారు కొందరు.. మరోవైపు, ఆమె పాటను మార్చినా, పాత పాటను డిలీట్‌ చేసినా హిందూ మత సంఘాలు వెనక్కి తగ్గడం లేదు.. ఇటు ఆమె కోసం కొందరు మద్దతుగా నిలుస్తుండడం విశేషం.. మరి, ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి..

Post Comment