తమ్ముడు అలా..అన్న ఇలా..అక్కినేని హీరోలు లేచేదేలా ..?

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో రెండే బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి నందమూరి మరోటి అక్కినేని. నందమూరి బ్రాండ్ ను పెద్దాయన తర్వాత బాలకృష్ణ కొనసాగించాడు. అటు ఏ ఎన్ ఆర్ బ్రాండ్ ను నాగార్జున కొనసాగించాడు. మూడో తరం లో నందమూరి జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చాడు. ఇటు అక్కినేని వారికి నాగ చైతన్య ఉంటాడు అనుకుంటే అది తేలడం లేదు. అతని తర్వాత ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అయినా కంటిన్యూ చేస్తాడు అనుకుంటే కుర్రాడు అరంగేట్రం లోనే తడబడ్డాడు. హ్యాట్రిక్ ఫ్లోప్స్ చూసాడు. బ్యాచులర్ మూవీతో గాడిలో పడ్డాడు అనుకుంటే ఇప్పుడు ఏజెంట్ రూపం లో పెద్ద దెబ్బ పడింది. ఇది బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది. కథే లేకుండా బరిలోకి దిగాం అని నిర్మాతే చెప్పుకున్నాడు అంటే ఈ చిత్రాన్ని యెంత నిర్లక్యంగా తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. ఇక అఖిల్ తీరు అలా ఉంటె అతని అన్న నాగ చైతన్య కెరీర్ కూడా ఏమంత గొప్పగా లేదు.


తమ్ముడు డిసాస్టర్ తర్వాత అన్న కస్టడీ మూవీతో రాబోతున్నాడు. టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందించిన చిత్రం ఇది. కృతి శెట్టి హీరోయిన్. ఇళయరాజా తో పాటు అతని తనయుడు యువన్ శంకర్ రాజా ఫస్ట్ కలిసి ఒక చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడం విశేషం. ఈ నెల 12న విడుదల కాబోతోన్న కస్టడీ పై ఇప్పటి వరకు ఎలాంటి బజ్ లేదు.

బట్ కొత్తగా ఏదైనా ప్లాన్ చేశారేమో కానీ రిలీజ్ ఇప్పటికైతే కస్టడీ ఎలాంటి సౌండ్ చేయడం లేదు అనేది నిజం. మరో విశేషం ఏంటంటే .. ఏజెంట్ లో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించాడు. కస్టడీ లో చైతు పోలీస్. మరి ఈ యూనిఫామ్ చైతు కి విజయాన్ని ఇస్తుందా లేదా అనేది చెప్పలేం కానీ .. ఇప్పుడు అక్కినేని హీరోలు హిట్స్ కొట్టకపోతే ఓవరాల్ గా అక్కినేని అనే బ్రాండ్ కె రిపేర్ వస్తుందనేది నిజం. ఆ బ్రాండ్ వేల్యూ ను నిలబెట్టుకోవాలంటే ఇటు నాగ చైతన్య తో పాటు అటు నాగార్జున కూడా ఓ బ్లాక్ బస్టర్ కొట్టాలి. లేకపోతె నాగ్ రిటైర్డ్ హీరోగా ఈ అన్నదమ్ములు టైర్ త్రీ హీరోలుగా మిగిలిపోతారు. ఇక అక్కినేని లెగసి చరిత్ర గా మిగిలిపోతుంది.

Related Posts