షన్నుకి గాయం రెండు వారాలు రెస్ట్…??
Latest Reality shows Small Screen Social Media

షన్నుకి గాయం రెండు వారాలు రెస్ట్…??

బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయిన నాటి నుండి తన స్టామినాకి తగ్గ గేమ్ ని ప్రదర్శించలేదు ప్రముఖ యూ ట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.. షన్ను ఆడుతున్న గేమ్ తీరుపై హోస్ట్ నాగార్జున సైతం విస్మయంతోపాటు అసంతృప్తి వ్యక్తం చేశాడు.. షన్నుని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చాడు.. ఏంట్రా ఇది.. ఆట మొదలుపెట్టరా.. నువ్వు హౌజ్ లో ఉన్నానని తెలిసేలా చేయరా అని నవ్వుతూనే చురకలు అంటించాడు..

తొలివారం కావడంతో గేమ్ ని సరిగా ప్రదర్శించలేకపోయాడు షన్ను.. తనకు కొత్త ప్రదేశానికి, కొత్త వ్యక్తులకు అలవాటు పడడానికి కొంత టైమ్ పడుతుందని వివరించాడు.. సెకండ్ వీక్ స్టార్టింగ్ లోనే షణ్ముఖ్ కాస్త ఈజ్ అయ్యాడు.. గేమ్ స్టార్ట్ చేశాడు..

పంతం నీదా నీదా అనే టైటిల్ తో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఈ టాస్క్ లో భాగంగా హౌజ్ మేట్స్ మధ్య భీకర యుద్ధం జరిగింది.. ఒకరిని ఒకరు ఢీ కొడుతూ పాయింట్స్ తెచ్చే చిన్న దిండ్ల కోసం తోసుకున్నారు.. వాటికోసం ముష్టిఘాతాలు విసురుకోకపోయినా, కలబడ్డారు.. ఈ గేమ్ లో భాగంగా యూ ట్యూబర్ షణ్ముఖ్ రెండుసార్లు కింద పడిపోయాడు.. ఒకసారి అతని మోకాలు బలంగా నేలని తాకింది. ఆ తర్వాత జరిగిన పోరులో సైతం వీజే సన్నీ, ఇతర కంటెస్టెంట్స్ షన్నుని బలంగా పట్టుకోవడం కనిపించింది.. ఇలా, రిలీజ్ చేసిన నిముషం ప్రోమోలోనే షన్ను రెండుసార్లు పడిపోవడం హాట్ టాపిక్ గా మారుతోంది..

షన్ను కాలికి గాయం అయిందని కొందరు చెబుతుండగా, ప్రోమోని చూస్తే అదేమీ కనిపించడం లేదని, అది ఊహాగానమే అని వాదిస్తున్నారు మరికొందరు.. షన్నుకి తగిలిన దెబ్బ మోకాలికి కావడంతో అతను రెండు వారాలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని, అయితే, హౌజ్ లో ఉన్నా సరిపోతుందని చెబుతున్నారు ఇంకొందరు. అలాంటిదేమీ లేదని, ఇవన్నీ కేవలం పుకార్లే అని కుండబద్దలు కొడుతున్నారు.. మరి, ఏది నిజమో, ఏది అబద్ధమో తేలాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయకతప్పదు..

Post Comment