ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు షోలో స‌మంత‌. ఎన్టీఆర్ కి విడాకుల గురించి చెప్పిందా..?
Latest Movies Reality shows Small Screen Tollywood

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు షోలో స‌మంత‌. ఎన్టీఆర్ కి విడాకుల గురించి చెప్పిందా..?

స్టార్ హీరోయిన్ స‌మంత‌.. అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన విష‌యం తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. కొన్నాళ్లు పాటు స‌మంత సైలెంట్ గా ఉంటుంది అనుకుంటే.. దీనిని నుంచి వెంట‌నే బ‌య‌ట‌ప‌డాలి అనుకుంటుంది. అందుక‌నే.. ఎప్పటిలాగే షూటింగ్ లతో బిజీ అవడానికి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సమంత ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ ఫోటో షూట్ కు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో ఎవరు మీలో కోటీశ్వరులు షో కు సెలెబ్రెటీ గెస్టుగా హాజరైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ గేమ్ షో లో సామ్ పాల్గొన్న ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. సమంత మేనేజర్ మహేంద్రతో కలిసి ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్యక్రమంలో అందుకున్న చెక్ ను చూపిస్తూ సమంత దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

అయితే…ఎవరు మీలో కోటీశ్వరులు షో లో స‌మంత పాల్గొంది అనే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆమెను ఎన్టీఆర్ ఏ ఏ ప్ర‌శ్న‌లు అడిగి ఉంటారు..? ఆమె విడాకుల గురించి ఏమైనా చెప్పిందా..? అనేది ఆస‌క్తిగా మారింది. అలాగే ఆమె ఎంత గెలుచుకుంది అనేది తెలియాలంటే ఎపిసోడ్ ప్ర‌సారం అయ్యే వ‌ర‌కు ఆగాల్సిందే. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉంది. దీని తర్వాత ఎన్టీఆర్ తో సమంత చేసిన ఎపిసోడ్ వచ్చే అవకాశం ఉంది. మ‌రి.. మ‌హేష్‌, స‌మంత‌తో చేసిన ఎపిసోడ్స్ తో ఎలాంటి రేటింగ్ వ‌స్తుందో చూడాలి.

Post Comment