జబర్దస్త్ జడ్జ్ గా నందమూరి బాలయ్య..
Latest Movies Reality shows Small Screen Tollywood

జబర్దస్త్ జడ్జ్ గా నందమూరి బాలయ్య..

బుల్లితెరపై బ్రహ్మాండమయిన రేటింగ్స్ తో దూసుకుపోతున్న కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ప్రారంభమై ఏడేళ్లు దాటింది. అయినా దానిపై ఆడియెన్స్ లో ఆదరణ ఇంచ్ కూడా తగ్గలేదు. జబర్దస్త్ షో నుండి అనేకమంది అప్ కమింగ్ కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. కొందరు స్టార్ హీరోల రేంజ్ స్టార్ డమ్ ని దక్కించుకున్నారు.. మరికొందరు హీరోలుగా, హీరోయిన్లుగా కూడా కొనసాగుతున్నారు..

మెగా బ్రదర్ నాగబాబు, రోజా జడ్జ్ లుగా ప్రారంభమయిన ఈ కామెడీ షోకి నాగబాబు గుడ్ బై చెప్పారు.. ఆయన మరో చానెల్ కోసం కామెడీ షో స్టార్ట్ చేశారు.. దానికి అంతగా రేటింగ్ దక్కలేదు… ఆ తర్వాత దానికీ రామ్ రామ్ చెప్పారు నాగబాబు.. తాజాగా ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఆయన త్వరలోనే తాను జబర్దస్త్ జడ్జ్ గా రావడానికి రెడీ అని ప్రకటించారు.. అయితే, గతంలో కొందరు కమెడియన్ లకు మల్లెమాల టీమ్ హ్యాండ్ ఇచ్చిందని, వారికి న్యాయం చేస్తే తాను జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తానని కండిషన్ పెట్టాడు మెగా బ్రదర్…

నాగబాబు…. జబర్దస్త్ షోలో కనిపిస్తాడో లేదో కానీ…. ఆయనకంటే ముందే నందమూరి బాలయ్య ఆ సీటులో కూర్చోవడం ఖాయం అని కన్ ఫమ్ అయినట్లు అర్ధం అవుతోంది. జబర్దస్త్ షో వేదిక నుండి బాలయ్యకు ఫోన్ కలిపింది రోజా… అఖండ సినిమా క్లయిమాక్స్ షూటింగ్ లో ఉన్న బాలయ్య… అయిదు నిముషాల సేపు రోజాతోపాటు షోలో మరో జడ్జ్ గా చేస్తోన్న మనోతోపాటు హైపర్ ఆది, అదిరే అభి, యాంకర్ అనసూయను పలుకరించారు..

అంతేకాదు, రోజా ఒకసారి జబర్దస్త్ షో జడ్జ్ గా రావాలని కోరారు.. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు బాలయ్య.. అంటే, తన అప్ కమింగ్ మూవీ అఖండ సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్య…. జబర్దస్త్ జడ్జ్ స్థానంలో ఆసీనులవడం ఖాయం అని తెలుస్తోంది.. అందుకే, ముందుగా జబర్దస్త్ టీమ్ ముందుగా బాలయ్యకి ఫోన్ చేయించి, ఆయనకు షోకి ఆహ్వానం అందించినట్లు భావిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. మరోవైపు, రోజా ఫోన్ ఇన్విటేషన్ ని మన్నించి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం..

బాలయ్య ఫోన్ కాల్ తో జబర్దస్త్ వేదిక మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. హైపర్ ఆది అయితే షాక్ అయ్యాడు.. గతంలో బాలయ్య తనకు వార్నింగ్ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. ఇది ఎంత నిజమో తెలియదు కానీ, హైపర్ ఆది, అదిరే అభి.. అనసూయ.. తనకంటే పెద్దవాళ్లని, వాళ్ల క్రేజ్ వేరని తెలిపారు బాలయ్య.. దీంతో, మరింత షాక్ అయ్యారు జబర్దస్త్ కంటెస్టెంట్ లు..

Post Comment