మహేష్‌, ఎన్టీఆర్ షో మళ్లీ వాయిదా పడిందా.?
Latest Movies Reality shows Small Screen Tollywood

మహేష్‌, ఎన్టీఆర్ షో మళ్లీ వాయిదా పడిందా.?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సక్సస్ ఫుల్ గా రన్ చేస్తున్న రియాల్టీ షో ఎవరు మీలో కోటీశ్వరులు. స్మాల్ స్ర్కీన్ పై ఈ షో దూసుకెళుతుంది. ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షో రికార్డు టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ షోలో పలువరు సినీ ప్రముఖులు పాల్గొనడం.. ఆ ఎపిసోడ్స్ బాగా సక్సస్ అవ్వడం జరిగింది. రామ్ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివ, సమంత.. ఈ షోలో పాల్గొన్నారు. దీంతో వీక్షకులు సినీ ప్రముఖులతో చేసే ఎపిసోడ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో కూడా ఎన్టీఆర్ ఓ ఎపిసోడ్ చేయడం జరిగింది.

ఈ వార్త బయటకు వచ్చినన్పటి నుంచి ఎప్పుడెప్పుడు మహేష్ తో ఎన్టీఆర్ చేసిన ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ ఎపిసోడ్ ను దసరాకి ప్రసారం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. దసరాకి సమంతతో చేసిన ఎపిసోడ్ ప్రసారం చేశారు. దీంతో దీపావళికి మహేష్ బాబుతో చేసిన ఎపిసోడ్ ప్రసారం చేస్తారని టాక్ వినిపించింది. ఎన్టీఆర్, మహేష్ షోలో పాల్గొన్నప్పటి ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగాయి. అయితే.. ఇప్పుడు దీపావళికి కూడా మహేష్‌ బాబు ఎపిసోడ్ ప్రసారం చేయడం లేదని తెలిసింది. మరి..ఈ క్రేజీ ఎపిసోడ్ ను ఎప్పుడు ప్రసారం చేస్తారో త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Post Comment