Serials Small Screen

‘ఆషాడంలో అత్త కోడళ్ళు’ ‘స్వర్ణ ప్యాలస్’ జీ తెలుగు

తెలుగు వారందికీ జీ తెలుగు ఒక మమతల కోవెల. ఎందుకంటే ప్రతి ఒక్క పండుగను, ప్రాధాన్యమైన రోజులును తన కుటుంబమైనా అభిమానులతో జరుపుకుంటుంది. అలాగే ప్రేక్షకులని సరికొత్త ధారావాహికలతో అలరిస్తుంది. మరి ఆషాఢమాసాన్ని ఎలా మరిచిపోతుంది? అందుకే ‘ఆషాడంలో అత్త కోడళ్ళు’ అనే కార్యక్రమంతో అందర్నీ ఆకట్టుకోవడానికి ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మరియు ‘స్వర్ణ ప్యాలస్’ అనే సీరియల్ తో ఈ సోమవారం జులై 26 సాయంత్రం 6 గంటలకు మీ ముందుకు వస్తుంది మన ప్రియతమైన ఛానల్.

అహ అల్లరి అల్లరి చూపులతో’ అని మొదలు పెట్టి ‘లహే లహే’ అని కుర్రకారుల మనసులను తన డాన్స్ పెర్ఫార్మన్స్ లతో ఉర్రూతలూగించడానికి ఎవర్గ్రీన్ హీరోయిన్ సంగీత ‘ఆషాడంలో అత్త కోడళ్ళు’ కార్యక్రమానికి సెలబ్రిటీ గెస్ట్ గా వచ్చేస్తుంది. ఆవిడతో కలిసి జీ తెలుగు అత్తాకోడళ్ళు ఎంతో ఆహ్లదంగా ఈ వేడుకను జరుపుకున్నారు. ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టడానికి మన యాంకర్ రష్మి గౌతమ్ మునుపెన్నడూ చూడని విధంగా తన పాట తోటి మరియు తనదైన దీటు పర్ఫార్మన్స్ తో అందరిని అలరించబోతుంది. మనల్ని ప్రతి రోజు అలరించే అత్తాకోడళ్ళ ముచ్చట్లు, ఆటపాటల సరదాలు, అబ్బో … కళ్లు అబ్బురపడిపోయేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దింది మన జీ తెలుగు. వీళ్ళతో పాటు మన జీ తెలుగు జంటలు అకుల్ బాలాజీ – రూప, చందు గౌడ – ఆషిక, కల్కి – పూజ, గోకుల్ – దీప్తి, మరియు ప్రజ్వల – అనూష అందరిని అలరించనున్నారు. ఈ కార్యక్రమం జులై 25 సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానుంది.

అప్పుడే సంబరాలు అయిపోయాయి అనుకోకండి, ఇంకా చాలా ఉంది.  ఎప్పుడు కూడా జీ తెలుగు బంధాలు, బంధుమిత్రుల ప్రేమానురాగాలను వారి కథలో చక్కగా తెలుపుతుంది. అలాగే ఈసారి కూడా ‘స్వర్ణ ప్యాలస్’ అనే సరికొత్త ధారావాహిక లో ‘శమంతకమణి హరం’ అనే చాలా విలువైన హారం చుట్టూ ఈ కథ తిరగడం గమనార్హం. వరోధిని పరిణయం, నిన్నే పెళ్లాడుతా సీరియల్స్ ద్వారా తెలుగు వారికి దగ్గరైన ‘చందన సేగు’, ‘ప్రతాప్ అభి’ మరోసారి ఈ సీరియల్ తో అందరిని వారిదైన శైలిలో మెప్పించబోతున్నారు. కుందన (చందన సేగు) కంసలివారి కూతురు. తన తండ్రి నుండి బంగారం చేసే ప్రక్రియను పుణికి పుచ్చుకుంది. కౌస్తబ్ (ప్రతాప్ అభి) కనకమేడల వంశానికి వంశోద్దారకుడు. తన ఇంటి గౌరవం మరియు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని అనుకుంటుంటాడు. ‘స్వర్ణ ప్యాలస్’ అనే బంగారం షోరూం కి అధిపతి. తన తల్లదండ్రులకు దక్కవలసిన గౌరవం, పేరు ప్రతిష్టలు కనకమేడల కుటుంబానికి దక్కడం చూసి కోపంతో రగిలిపోతుంది కుందన. అలాంటి అమ్మాయి జీవితంలోకి కనకమేడల కౌస్తభ్ ప్రవేశిస్తే తన జీవితం ఎలా మారుతుంది? తన తల్లి చేసిన త్యాగం గురించి లోకానికి చెప్పగలుగుతుందా? ఆ రెండు కుటుంబాలని తాను కలపగలుగుతుందా? తెలుసుకోవాలంటే జులై 26 నుండి సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగు లో తప్పక చూడండి.

ఇంక ఎందుకు ఆలస్యం? ఈ ఆదివారం జులై 25 సాయంత్రం 5 గంటలకు ‘ఆషాడంలో అత్త కోడళ్ళు’ మరియు జులై 26 నుండి సోమవారం సాయంత్రం 6 గంటలకు ‘స్వర్ణ ప్యాలస్’ ధారావాహికను తప్పక వీక్షించండి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానళ్లలో.

 ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Post Comment