ధనుష్ ఫస్ట్ టైమ్ తెలుగులో నటిస్తోన్న సినిమా సార్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. జివి ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నాడు. నేటి విద్యా వ్యవస్థపై సెటైరికల్ గా రూపొందిన యాక్షన ఎంటర్టైనర్ గా ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తే అర్థమైంది.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఒకేసారి వాతిగా విడుదల కానున్న ఈ మూవీ ఈ డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు ఆ మధ్య ప్రకటించారు. బట్ లేటెస్ట్ గా ఈ మూవీని డిసెంబర్ 2న విడుదల చేయడం లేదని కొత్త రిలీజ్ డేట్ తో అనౌన్స్ చేశారు. అంటే సినిమా పోస్ట్ పోన్ అయిందన్నమాట.


ధనుష్ కు తెలుగులోనూ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బలమైన కథలు ఉంటేనే అతను కమిట్ అవుతాడు. అందుకే ఈ మూవీ అనౌన్స్ అయినప్పుడు ఖచ్చితంగా అతనికి టాలీవుడ్లో మంచి హిట్ గా నిలుస్తుందని భావించారు.

అందుకు తగ్గట్టుగానే టీజర్ తర్వాత స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నారు అనిపించింది. మామూలుగా సితార బ్యానర్ లో వచ్చే సినిమా అంటే కథాబలం ఉన్న చిత్రాలే అని ఇప్పటికే ప్రూవ్ అయింది. ఇలాంటి టైమ్ లో సడెన్ గా ఈ చిత్రాన్ని ఎందుకు పోస్ట్ పోన్ చేశారు అనేది తెలియడం లేదు. బట్.. కాస్త టేల్ అయినా బెస్ట్ నే ఇస్తారు ఎవరైనా. ఇది అలాగే అనుకోవాలేమో.

మరి ఇంతకీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడూ అంటారా.. 2023 ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఈ డేట్ పై తెలుగులో పెద్దగా ఇబ్బంది లేదు కానీ.. పోస్ట్ పోన్ అనౌన్స్ మెంట్ ధనుష్ కోలీవుడ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

, , , , , , , ,