మొన్నటి వరకూ మోస్ట్ కాంట్రవర్శీయల్ స్టార్ అనిపించుకున్నాడు శింబు. కానీ ఇప్పుడు మారాడు. అందుకు కారణం.. తను యారోగెంట్ గా ఉన్న టైమ్ లో వచ్చిన వరుస డిజాస్టర్సే. మధ్యలో లవ్ ట్రాకులు, పంచాయితీలు చాలా కామన్ గా ఫేస్ చేశాడు. ఎవరి లైఫ్ లో అయినా మార్పు తప్పదు. ముఖ్యంగా తప్పు తెలుసుకున్నవాళ్లు పూర్తిగా మారిపోతే ఎలా ఉంటుందో శింబును చూస్తే తెలుస్తుంది. అలా మారిన తర్వాత శింబు ఇప్పుడు వరుస విజయాలు చూస్తున్నాడు. రీసెంట్ గా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నటించిన మానాడు సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతకు ముందు చేసిన ఈశ్వరన్ సైతం తమిళ్ లో కమర్శియల్ గా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు తనకు బాగా కలిసొచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వెందు తనింధత్తు కాడు అనే సినిమాతో వస్తున్నాడు. అంటే తగలబడ్డ అడవి అని అర్థం. ఈ చిత్రాన్నే తెలుగులో ద లైఫ్ ఆఫ్‌ ముత్తు పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.

నిజానికి ఈ చిత్రాన్ని ఈ గురువారం తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సడెన్ గా 17వ తేదీకి మార్చారు. తమిళ్ లో గురువారమే వస్తుంది. రీసెంట్ గా విడుదల చేసిన తెలుగు టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ కూడా ట్రెమండస్ అనిపించుకుంటోంది.శింబు సరసన సిద్ధీ ఇద్నానీ హీరోయిన్ గా నటించిన ఈచిత్రంలో సీనియర్ నటి రాధిక కీలక పాత్ర చేసింది. ఓ చిన్న గ్రామానికి చెందిన కుర్రాడు పట్టణానికి రావడం.. అక్కడ తనపై ఆధిపత్యం చెలాయించిన వారిపై తిరుగుబాటు చేసి వారి ప్లేస్ లోకి తను వెళ్లడం అనే కోణంలో ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. ఈ కోణంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ ట్రైలర్ లోనే గౌతమ్ మీనన్ టేకింగ్ మెస్మరైజ్ చేస్తోంది. అలాగని గత సినిమాలకు భిన్నమైన, మించిన పాయింట్ ఇంకేదో సినిమాలో ఉంది అనిపిస్తోంది. ట్రైలర్ లో శింబు నాలుగైదు ఏజ్ గ్రూప్స్ లో కనిపిస్తున్నాడు.

ఆ మొత్తం లుక్స్ లోనూ పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు. మొత్తంగా ఈ ట్రైలర్ మోస్ట్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. విశేషం ఏంటంటే.. శింబు రీసెంట్ గా తెలుగులో హీరో రామ్ పోతినేని సినిమాల ది వారియర్ లో ఓ పాట పాడాడు. ఆ రిలేషన్ వల్లో లేక అంతకు ముందే కమిట్ అయ్యారో కానీ ఈ చిత్రాన్ని తెలుగులో స్రవంతి రవికిశోర్ విడుదల చేస్తున్నాడు.మొత్తంగా మన్మథ సినిమాతో శింబుకు తెలుగులో అప్పట్లో మంచి పాపులారిటీ వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఈ ముత్తు ట్రైలర్ చూస్తోంటే అతనికి మళ్లీ తెలుగు మార్కెట్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ సారి ఎలా ఉంటుందో చూడాలి.

, , , , ,