Advertisement
శ్యామ్ సింగ రాయ్ – రివ్యూ
Latest Movies Reviews Tollywood

శ్యామ్ సింగ రాయ్ – రివ్యూ

Advertisement

న్యాచురల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ న‌టించారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ విభిన్నమైన‌.. బ‌ల‌మైన‌ క‌థాంశంతో రూపొందిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం పై ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. దీనికి తోడు ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా రిలీజ్ అవుతుండ‌డంతో ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది. ఈ క్రేజీ మూవీ ఈరోజు అన‌గా డిసెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి.. నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాతో అంచ‌నాల‌ను అందుకున్నాడా..? బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌యం సాధించాడా..? అనేది ఇప్పుడు చూద్దాం.

క‌థ

వాసుదేవ్ (నాని) ఒక అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్. ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తుంటాడు. ఈ షార్ట్ ఫిల్మ్ చేసే క్రమంలో కీర్తి (కృతి శెట్టి) ప‌రిచ‌యం అవుతుంది. ఆమెను వెంట‌ప‌డి షార్ట్ ఫిల్మ్ లో న‌టించేలా చేస్తాడు. ఇక షార్ట్ ఫిల్మ్ త‌ర్వాత సినిమా తీస్తాడు. జాతీయ స్ధాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే.. వాసుదేవ్ ఆ సినిమా క‌థ‌ను శ్యామ్ సింగ రాయ్ బుక్ నుంచి కాపీ కొట్టాడ‌ని అరెస్ట్ చేస్తారు. వాసుదేవ్ కాపీ కొట్ట‌లేదంటారు.

అస‌లు శ్యామ్ సింగ రాయ్ (నాని) ఎవ‌రు.? రోజీ (సాయి ప‌ల్ల‌వి)కి శ్యామ్ కి ఉన్న సంబంధం ఏంటి.? వాసుదేవ్ త‌న‌కు తెలియ‌కుండానే శ్యామ్ సింగ రాయ్ క‌థ‌ని కాపీ కొట్టాడా..? వాసుదేవ్ చెబుతున్న‌ది నిజ‌మేనా..? శ్యామ్ సింగ రాయ్, వాసుదేవ్.. ఈ ఇద్ద‌రికీ ఉన్న సంబంధం ఏంటి.? వాసుదేవ్ జీవితంలో త‌ర్వాత ఏం జ‌రిగింది అనేదే మిగిలిన క‌థ‌.

ప్లస్ పాయింట్స్

నాని, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌
క‌థ‌, క‌థ‌నం
రాహుల్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌
మిక్కి జే మేయ‌ర్ మ్యూజిక్

మైన‌స్ పాయింట్స్

అక్క‌డ‌క్క‌డా స్లోగా ఉండ‌డం.

విశ్లేష‌ణ

వాసుదేవ్, శ్యామ్ సింగ రాయ్ ఈ రెండు పాత్ర‌ల్లో పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించి మెప్పిచాడు. ఇంకా చెప్పాలంటే.. మ‌రోసారి నేచుర‌ల్ స్టార్ అనిపించుకున్నాడు. వ‌న్ మ్యాన్ షోగా నాని క‌థ‌ను భుజాన్నివేసుకుని ర‌స‌త‌వ్త‌రంగా న‌డిపించాడు. యాక్ష‌న్, ఎమోష‌న‌ల్ సీన్స్ లో ప‌ర్ ఫెక్ట్ అనిపించేలా న‌టించి ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాడు. ఇక హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి విష‌యానికి వ‌స్తే.. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ఎప్ప‌టిలానే లీన‌మై న‌టించింది. న‌ట‌న‌తోను, నాట్యంతోనూ మ‌రోసారి మెప్పించింది. అలాగే కృతిశెట్టి, మ‌డోన్నా కూడా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు. మిగిలిన న‌టీన‌టులు పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించారు.

దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ప‌ట్టుస‌డ‌ల‌ని క‌థ‌నం రాసుకున్నారు. మ‌రీ.. ముఖ్యంగా నాని అంటే ఎంట‌ర్ టైన్మెంట్. మ‌న ప‌క్కంటి కుర్రాడుని తెర పై చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఈ విష‌యం బాగా తెలుసుకున్న ద‌ర్శ‌కుడు రాహుల్.. వాసుదేవ్ పాత్ర‌తో కావాల్సిన వినోదాన్ని అందించాడు. ఇక సెకండాఫ్ లో వ‌చ్చే ప్లాష్ బ్యాక్ మరియు శ్యామ్ సింగరాయ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ బాగున్నాయి.

ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా బాగుంది. ఈ క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా మిక్కీ జే మేయ‌ర్ చ‌క్క‌ని సంగీతం అందించారు. అయితే.. అక్క‌డ‌క్క‌డా కాస్త స్లో అనిపించింది. అది త‌ప్పితే.. ఈ సినిమాకి పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ మైన‌స్ లు ఏమీ లేవు. కంటెంట్, క‌మ‌ర్షియ‌ల్ అంశాలు రెండూ క‌లిసి వ‌చ్చే సినిమాలు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. అలాంటి అరుదైన సినిమానే శ్యామ్ సింగ రాయ్. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌సూలు సాధించ‌డం ఖాయం. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్.

రేటింగ్ 3.5/5

Advertisement