ad

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దాదాపు రెండేళ్ల త‌ర్వాత నాని న‌టించిన సినిమా థియేట‌ర్లోకి రావ‌డంతో ఆశించిన విజ‌యం అందుకున్నారు. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు పూర్తి భిన్నంగా రూపొందిన శ్యామ్ సింగ రాయ్ తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజైంది. అక్క‌డ కూడా ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

అయితే.. ఇప్పుడు క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌ద్యంలో శ్యామ్ సింగ రాయ్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వ‌చ్చింది. ఓటీటీ ప్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ లో జ‌న‌వ‌రి 21న శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌టించారు. సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా క‌థానాయిక‌లు.

క్రిస్మ‌స్ కానుక‌గా థియేట‌ర్లో రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం సంక్రాంతి త‌ర్వాత 21న ఓటీటీలో రిలీజ్ కానుంది. మ‌రి.. థియేట‌ర్లో స‌క్స‌స్ సాధించిన శ్యామ్ సింగ రాయ్ ఓటీటీలో ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో చూడాలి.

, , , , , , , , , , , , , , , , ,