Advertisement
సీనియ‌ర్ అయినా, యంగ్ స్టార్ అయినా ఓకే అంటున్న శృతి
Latest Movies Tollywood

సీనియ‌ర్ అయినా, యంగ్ స్టార్ అయినా ఓకే అంటున్న శృతి

Advertisement

యూనివ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కూతురుగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది అందాల శృతి హాస‌న్. అన‌గ‌న‌గా ఓ థీరుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా స‌క్స‌స్ సాధించ‌క‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు కెరీర్ అనుకున్నంత‌గా ముందుగా సాగ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో శృతి కెరీర్ మ‌లుపు తిరిగింది. వ‌రుస‌గా అవ‌కాశాలు అందిపుచ్చుకుంది.

అయితే.. కెరీర్ పీక్స్ ఉన్న‌ప్పుడు ల‌వ్ అంటూ కెరీర్ పై కాన్ స‌న్ ట్రేష‌న్ చేయ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ వెన‌క‌బ‌డింది. ఈ టైమ్ లో వ‌కీల్ సాబ్, క్రాక్ సినిమాల్లో న‌టించ‌డం.. ఈ రెండు సినిమాలు స‌క్స‌స్ సాధించ‌డంతో శృతి టైమ్ మ‌ళ్లీ స్టార్ట్ అయ్యింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ స‌లార్ లో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది. అయితే.. యంగ్ హీరోలే కాదు.. సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు కూడా ఓకే చెబుతుంది.

ఇటీవల తన తండ్రి కమల్ హాసన్ కు సమకాలీనులైన హీరోలకు శృతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభిమానులను షాక్ కి గురి చేస్తోంది. బాలకృష్ణ సరసన ఓ భారీ చిత్రంలో న‌టిస్తుంది. దీనికి మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ సినిమాకు సంతకం చేస్తోందని సమాచారం. బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కోసం శృతి చర్చలు సాగిస్తున్నారని తెలిసింది. ప్ర‌స్తుతం శృతికి బాగా డ‌బ్బులు అవ‌స‌రం. అందుకే సీనియ‌ర్స్ తో కూడా న‌టించేందుకు ఓకే అంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. ఏదైతేనే.. శృతి వ‌రుస ఆఫ‌ర్స్ తో ఫుల్ బిజీ అయ్యింది.

Advertisement