Advertisement
షాకింగ్.. ఆర్ఆర్ఆర్ మ‌ళ్ళీ వాయిదా..?
Bollywood Latest Movies Regional Tollywood

షాకింగ్.. ఆర్ఆర్ఆర్ మ‌ళ్ళీ వాయిదా..?

Advertisement

ఆర్ఆర్ఆర్.. ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్న సినిమా ఇది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌కు రెడీ అయ్యింది. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ అన్ని అడ్డంకుల‌ను దాటుకుని ఎట్ట‌కేల‌కు విడుద‌ల అవుతుంది అన‌కుంటే.. ఇప్పుడు ఓమిక్రాన్ టెన్ష‌న్ పెడుతుంది. నార్త్ తో పాటు సౌత్ లో కూడా ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌డంతో ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

 

తాజా వార్త ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ విడుద‌ల వాయిదా అంటూ గ‌ట్టిగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈరోజు నుంచి త‌మిళ‌నాడులో సినిమా హాల్స్ లో సిటింగ్ యాభై శాత‌మే అంటూ కొత్త నిబంధ‌న పెట్టింది. దీంతో ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూట‌ర్స్ ముందు ఇచ్చిన అమౌంట్ కి బాగా త‌గ్గించి అడుగుతున్నార‌ట‌. అన్ని ఏరియాల్లో ఇదే ప‌రిస్థితి. అందుక‌నే ఆర్ఆర్ఆర్ మ‌రోసారి వాయిదా వేయ‌డం త‌ప్ప‌డం లేదంటున్నారు.

ఈసారి వాయిదా ప‌డితే.. ఎప్పుడు వ‌స్తుంది అంటే.. వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కావచ్చని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ విడుద‌ల అనేది మాత్రం ప్రస్తుతం గందరగోళంగానే ఉంది. మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. డిస్ట్రిబ్యూట‌ర్స్ కి ఆర్ఆర్ఆర్ వాయిదా అని చెప్పేసార‌ని స‌మాచారం. రిలీజ్ కి కొన్ని రోజులు మాత్రమే ఉంది. అందుచేత త్వ‌ర‌లోనే ఆర్ఆర్ఆర్ విడుద‌ల వాయిదా అని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Advertisement