కొన్ని కాంబినేషన్స్ గురించి గాసిప్స్ వచ్చినా గూస్ బంప్స్ వస్తాయి. ఆ కాంబోస్ కు ఉండే పవర్ అలాంటిది. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ కు గీతా ఆర్ట్స్ బ్యానర్ రంగం సిద్ధం చేసింది. ఒకప్పుడు మల్టీస్టారర్ అనగానే ఆయా హీరోల అభిమానులు రకరకాలుగా పోట్లాడుకునేవారు. ఇప్పుడూ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ టైమ్ లో నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ నడిచింది. మాటలు దాటి బూతుల వరకూ వెళ్లి.. అసహ్యకరమైన మీమ్స్ తో పాటు ట్రోల్స్ తోనూ రెచ్చిపోయారు. ఇంతా చేసి ఆ హీరోలు బానే ఉన్నారు. లేటెస్ట్ గా తమ సినిమా ప్రమోషన్ కోసం మరోసారి కలిసి జపాన్ వెళ్లారు. అయితే ఈ తరహా ట్రోల్స్ కు కూడా పెద్దగా ఆస్కారం లేకుండా ఉండేలా అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ వేశాడు. అదేంటో తెలుసా..

మెగా – అల్లు మల్టీస్టారర్. యస్.. రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ను నిర్మించేందుకు గీతా ఆర్ట్స్ బ్యానర్ సన్నాహాలు చేస్తోంది.నిజానికి చరణ్‌, అర్జున్ కలిసి సినిమా చేయాలని చాలాకాలంగా అభిమానుల నుంచి కూడా ఓ డిమాండ్ ఉండేది. కొన్నాళ్లుగా సిట్యుయేషన్స్ మారిపోయాయి. ఒకప్పుడు మెగా హీరోల ట్యాగ్ లో ఉన్న అర్జున్ తనదైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకుని ” అల్లు” అనే బ్రాండ్ తోనే ముందుకు వెళుతున్నాడు. అయినా మెగా ఫ్యామిలీతో రాపో ఉంటుంది. రీసెంట్ గా రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ తో చేసిన మల్టీస్టారర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక చరణ్ – ఎన్టీఆర్ లతో సినిమా చేయడానికి ఇదే రైట్ టైమ్ అని డిసైడ్ అయినట్టున్నాడు.

అందుకే ఈ కాంబోలో మరో భారీ మల్టీస్టారర్ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు.చాలామంది ఇది రూమర్ అనే అనుకుంటున్నారు. కానీ కాదు. నిజంగానే చరణ్‌ – అర్జున్ లతో అదే టైటిల్ గా ఓ మూవీ చేయబోతున్నాడు అరవింద్. అరవింద్ సినిమా అంటే కేవలం కాంబినేషన్ కోసమో లేక ఫ్యామిలీ కోసమో ఉండదు. కంప్లీట్ కమర్షయల్ లెక్కలతోనే ఉంటుంది. అందుకు తగ్గ కథ కోసం చాలాకాలంగా చూస్తూనే ఉన్నాడట. రీసెంట్ గా ఓ స్టోరీ నచ్చడంతో దాన్ని లాక్ చేశారని సమాచారం. త్వరలోనే ఇద్దరు హీరోలకూ ఈ కథ వినిపించి.. వారి డేట్స్ తీసుకున్న తర్వాతే దర్శకుడుతో పాటు ఇతర వివరాలను వెల్లడించాలని నిర్ణయించుకున్నారట. మరి కథ బావుంటే కాదనడం ఇద్దరు హీరోలకూ కుదరదు. ఒకవేళ కాస్త అటూ ఇటూగా ఉన్నా.. ఇద్దరి ఇమేజ్ లను మ్యాచ్ చేసేలా మార్పులూ చేర్పులూ ఉంటాయి. సో.. త్వరలోనే తెలుగు తెరపై ఓ భారీ అండ్ క్రేజీ మల్టీస్టారర్ చూడబోతున్నామాట.

, , , , ,