మెగాస్టార్‌ చిరంజీవి చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అని చిరంజీవి ట్వీట్‌ చేసిన వాయిస్‌ ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అయింది. మెగాస్టార్‌ ఈ మధ్య ఎవరెవరిని కలిశారు? మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా? ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా ఎవరైనా రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారా? అంటూ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం నెట్టింట్లో ఇంకో రకంగా స్పందిస్తున్నారు. చిరంజీవి సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేయమంటే, చిరంజీవితో సెల్ఫ్‌ ట్రోల్స్ చేయిస్తున్నారేంట్రా అంటూ మొరపెట్టుకుంటున్నారు.

మలయాళ లూసిఫర్‌ ఆధారంగా తెలుగులో తెరకెక్కిన సినిమా గాడ్‌ఫాదర్‌. ఈ సినిమా రిలీజ్‌కి ముందు కావాల్సినంత బజ్‌ కొరవైందన్నది ఫిల్మ్ నగర్‌ టాక్‌. ఆ మధ్య నయనతార లుక్‌ రిలీజ్‌ చేసినా, రీసెంట్‌గా సత్యదేవ్‌ లుక్‌ని వైరల్‌ చేయడానికి ట్రై చేసినా పెద్దగా యూజ్‌ లేకపోయింది. అందుకే ఇప్పుడు బజ్‌ క్రియేట్‌ చేయడానికి ఏకంగా మెగాస్టార్‌ రంగంలోకి దిగారని టాక్‌. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అన్నది లూసిఫర్‌ మూవీలో ఫేమస్‌ డైలాగ్‌.

ఆ డైలాగ్‌ని ఇంట్రస్టింగ్‌గా చెప్పి పోస్ట్ చేశారు చిరంజీవి.దసరా కానుకగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది గాడ్‌ఫాదర్‌. అదే రోజు అక్కినేని నాగార్జున గోస్ట్ కూడా రిలీజ్‌ కానుంది. ఆల్రెడీ గోస్ట్ ప్రమోషన్లు స్పీడందుకున్నాయి. బిగ్‌బాస్‌ షోతో జనాల్లోనే ఉన్నారు నాగ్‌. ఇప్పుడు వేగంగా జనాల ముందుకు రావాల్సింది చిరంజీవే. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు వాయిస్‌ మెసేజ్‌ ట్వీట్‌ చేశారు.

, , , , , , ,