విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన వెర్సటైల్ హీరో సత్యదేవ్‌. విలక్షణ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్న  సత్యదేవ్.. ఇప్పుడు మరో యూనిక్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి  ‘పెంగ్విన్’ ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యదేవ్ 26వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రం క్రైమ్ యాక్షన్ గా వుండబోతోంది. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా.

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రెడ్ థీమ్‌తో రూపొందించిన గుర్రం కనిపిస్తుంది. త్వరలోనే సినిమా లాంచ్ కానుంది. ఈ మల్టీస్టారర్ మూవీలో మరో  ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు కనిపించనున్నారు.బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

, , ,