Advertisement
MAHESH BABU : – “సర్కారు వారి…” సందడి మొదలు
Latest Movies Tollywood

MAHESH BABU : – “సర్కారు వారి…” సందడి మొదలు

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సర్కారు వారి పాట. ఏప్రిల్ 1న రిలీజ్ కు ముహూర్తం పెట్టుకున్న ఈ సినిమా ప్రచార సందడికి రంగం సిద్ధం చేసుకుంటోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న సర్కారు వారి పాట చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ కు తేదీ ఖరారు చేశారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా సర్కారు వారి పాట సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నారు. నెలన్నర ముందు నుంచే పబ్లిసిటీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ సింగిల్ రిలీజ్ పోస్టర్ ను రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ విడుదల చేశారు.

మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో దూకుడు, ఆగడు, బిజినెస్ మేన్ లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. ఇటీవల థమన్ ఉన్న స్పీడుకు వాటిని మించిన సూపర్ హిట్ ఆల్బమ్ ను ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా అంటే థమన్ స్పెషల్ కేర్ తో కంపోజ్ చేస్తుంటాడు. సర్కారు వారి పాట గ్లింప్స్ లో ఇచ్చిన టైటిల్ బిట్ కూడా అదిరిపోయింది. ఇక ఫస్ట్ సింగిల్ పైనే మ్యూజిక్ లవర్స్ దృష్టిపెట్టారు.

సర్కారు వారి పాట సినిమాను 14 రీల్స్ ఫ్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ మహేష్ సరసన కనిపించబోతోంది. బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంతో సర్కారు వారి పాట సినిమా కథాంశం ఉండబోతోంది. లాస్ట్ ఇయర్ మహేష్ బాబు బర్త్ డే కు రిలీజ్ చేసిన బర్త్ డే బ్లాస్టర్ లో ఇఫ్ యు మిస్ ద ఇంట్రెస్ట్ యువిల్ గెట్ యువర్ డేట్ అంటూ సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్, స్టైలిష్ ఫైట్స్ చూస్తే సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఈ గ్లింప్స్ తో కంప్లీట్ మమూవీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నెలన్నర ముందే పబ్లిసిటీ స్టార్ట్ చేసి ఏప్రిల్ 1న సర్కారు వారి పాట సినిమాను థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు టీమ్ రెడీ అవుతోంది.

Advertisement