ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక
గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హైస్కూల్
చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్..తను నేను చిత్రంతో కథానాయకుడిగా
అడుగుపెట్టారు.  తొలి చిత్రంతోనే ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
డైలీ లైఫ్ లో కనిపించే కుర్రాడిగా కనిపించడం సంతోష్ శోభన్ కున్న
అడ్వాంటేజ్. పేపర్ బాయ్ తో క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకుని, ఏక్ మినీ కథ,
మంచి రోజులు వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. మారుతి
లాంటి పేరున్న దర్శకులతో పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెబుతుంటారు
సంతోష్.సినిమాల్లో బిజీగా ఉంటూనే ఓటీటీ లో ప్రాజెక్ట్స్ చేస్తూ మరో సెక్షన్
ఆడియెన్స్ నూ మెప్పిస్తున్నారు.

సంతోష్ శోభన్ నటించిన ద గ్రిల్, ద బేకర్
అండ్ ద బ్యూటీ వెబ్ మూవీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం
ప్రేమ్ కుమార్ అనే సినిమాతో పాటు యూవీ క్రియేషన్స్ లో రెండు ప్రాజెక్ట్స్
లకు ప్లానింగ్ జరుగుతోంది. ఒక సినిమా ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయి
రిలీజ్ కు రెడీ గా ఉండగా,మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే స్వప్న
సినిమా పతాకంపై ప్రియాంక దత్ నిర్మాణంలో నందినీరెడ్డి దర్శకత్వంలో “అన్ని
మంచి శకునములే” అనే సినిమాలో సంతోష్ శోభన్ నటిస్తున్నారు. ఆయన నటించిన
కొత్త సినిమా “లైక్ షేర్ సబ్ స్క్రైబ్” , నవంబర్ 4న రిలీజ్ కానుంది.ఈ
ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఈ క్రేజీ మూవీస్ అన్నీ ఈ
యంగ్ హీరోను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

, , , ,