అక్కడి హీరోలు ఇక్కడ, ఇక్కడి హీరోలు అక్కడ నటించడం మామూలైపోయింది. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమా సక్సెస్‌ కావాలంటే ఆయా భాషల నుంచి నటీనటుల్ని సెలక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఈ విషయాన్ని మనవాళ్లు ఎప్పుడో అర్థం చేసుకున్నారు. తమిళ్‌, కన్నడ, మలయాళ ఆర్గిస్టులను మన సినిమాల్లో ఇంక్లూడ్‌ చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడిప్పుడే తమిళ తంబిలకు అర్థమవుతోంది. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్న సినిమాల్లో పొరుగు హీరోల భాగస్వామ్యాన్ని పెంచుతున్నారు. లేటెస్ట్ గా ధనుష్‌ నటిస్తున్న ఓ సినిమా కోసం తెలుగు హీరో సందీప్‌ కిషన్‌ని సెలక్ట్ చేసుకున్నారు.

రీసెంట్‌గా విక్రమ్‌ సినిమాను డైరక్ట్ చేసిన లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన మానగరం సినిమాలో హీరో సందీప్‌కిషన్‌. తెలుగులో ఎంత మార్కెట్‌ ఉందో, తమిళ్‌లోనూ అంతే మార్కెట్‌ తెచ్చుకున్న హీరో. అయితే రీసెంట్‌ టైమ్స్ లో సరైన హిట్‌ లేక తికమకపడుతున్నారు సందీప్‌. సోలో హీరోగా ఎంత ట్రై చేసినా సక్సెస్‌ రాకపోవడంతో, పెద్ద హీరోల సినిమాల్లో ప్రామినెంట్‌ కేరక్టర్లను ఓకే చేస్తున్నారు.ఇటీవల తిరుచిత్రంబలం హిట్‌ మీదున్న ధనుష్‌ నెక్స్ట్ కెప్టెన్‌ మిల్లర్‌ అనే సినిమా చేస్తున్నారు. సానికాయిదమ్‌, రాకీ సినిమాలకు దర్శకత్వం వహించిన అరుణ్‌ మాదేశ్వరన్‌ ఈ సినిమాకు డైరక్టర్‌.

ధనుష్‌తో పాటు మరో హీరోకి కూడా ఈ సినిమాలో స్కోప్‌ ఉందట.అందుకే సందీప్‌ కిషన్‌ని కలిసి కథ నెరేట్‌ చేశారట అరుణ్‌. సందీప్‌ ఓకే చెప్పేశారని టాక్‌.అక్టోబర్‌ 7 నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. తమిళనాడులో పేరున్న సత్యజ్యోతి ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఐదు భాషల్లో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు కెప్టెన్‌ మిల్లర్‌ని. ధనుష్‌ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందనే ప్రచారం అప్పుడే మొదలైపోయింది.

, , , , , , , ,