ad

ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై బి.ఎస్. రాజు సమర్పణలో అర్.ఆర్. నిర్మాత గా తెరకెక్కిన చిత్రం “ధగడ్ సాంబ”. సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు.. U/A సర్టిఫికెట్ వచ్చింది. ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుంది . సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ప్రశంసలు పొంది. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్ & ప్రోమోకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 9.న ట్రైలర్ విడుదల కానుంది. కామెడీ యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి.
మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ సంపూర్ణేష్ ఈ సినిమాలో చేశారు. ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు. మూవీలోని పాటల కోసం అద్భుతమైన సెట్స్ వెయ్యడం జరిగింది. పాటలకు సంపూర్ణేష్ తనదైన శైలిలో స్టెప్స్ వెయ్యడం జరిగింది. ధగడ్ సాంబ చిత్రంలో హీరోయిన్ సోనాక్షి నటన అదనపు ఆకర్షణ కానుంది. త్వరలో వైజాగ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తామని … మే. 20.న సినిమా విడుదల చేస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

నటీనటులు:
సంపూర్ణేష్ బాబు, సోనాక్షి, జ్యోతి, చలాకి చంటి, మిర్చి మాధవి, ఆనందభారతి, పిడి.రాజు తదితరులు

, , , , , , ,