ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అందాల సమంత. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించింది. అంతే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ భాషల్లో నటించి మెప్పించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న సమంత మొదటిసారి వెబ్ సిరీస్లో నటించింది. ది ఫ్యామిలీ మాన్ సీజన్ 1కు కొనసాగింపుగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో సమంత రాజీ అనే పాత్రలో నటించింది.
ఇందులో కెరీర్లో ఎప్పుడూ చేయని ఓ ఇంటెన్స్ క్యారెక్టర్లో నటించింది. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించి ప్రశంసలు అందుకుంది. అయితే.. ఇప్పుడు ఓటిటి నుంచి ది బెస్ట్ నటుల ఫీమేల్ జాబితాలో ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2లో నటనకు గానూ సమంతకు అవార్డు లభించించింది. ఈ విషయాన్ని స్వయంగా ఫిల్మ్ ఫేర్ వారు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తనకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ రావడంతో ఆనందంతో ఉప్పొంగిపోతూ సమంత థాంక్స్ అంటూ సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. రీసెంట్ గా యశోదా సినిమాని ప్రకటించింది. ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. తమిళ్ లో ఓ సినిమా చేస్తుంది. అలాగే హాలీవుడ్ మూవీ కూడా చేస్తుంది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.