స్టార్ హీరోయిన్ సమంత‌.. బాలీవుడ్ స్టార్ స‌న్నీలియోన్ పోటీ ప‌డుతున్నారు. ఈ పోటీలో గెలిచేదెవ‌రో చూడాల‌ని సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అదేంటి! వీరిద్ద‌రూ ఏ సినిమాలో క‌లిసి న‌టించ‌లేదుగా.. పోనీ! ఇద్ద‌రు సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఒకే రోజు లేవుగా అనే సందేహం రాక మాన‌దు. అస‌లు విష‌య‌మేమంటే సన్నీలియోన్‌తో స‌మంత పోటీ ప‌డే విష‌యం నిజ‌మే. అది కూడా సినిమా విష‌యంలోనే. వివ‌రాల్లోకి వెళితే స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన పాన్ ఇండియా మూవీ ‘యశోద’. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతుంది. అదే సమయంలో విష్ణు మంచు హీరోగా సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం జిన్నా ట్రైల‌ర్ కూడా సెప్టెంబ‌ర్ 9నే రిలీజ్ అవుతుంది.

ఒక‌వైపు స‌మంత‌.. మ‌రో వైపు ఇద్ద‌రు గ్లామ‌ర‌స్ హీరోయిన్స్ స‌న్నీలియోన్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ మ‌ధ్య ట్రైల‌ర్ విస‌యంలో పోటీ అయితే గ‌ట్టిగానే జ‌ర‌గ‌నుంద‌ని సినీ వ‌ర్గాలంటున్నాయి. వ్యూస్ ప‌రంగా మ‌రి సామ్ పైచేయి సాధిస్తుందా! లేక పాయ‌ల్ మ‌రియు స‌న్నీలియోన్ స‌క్సెస్ అవుతారా అనేది చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. యశోద‌, జిన్నా రెండు సినిమాలు అక్టోబ‌ర్‌లోనే విడుద‌లయ్యే అవ‌కాశాలున్నాయ‌ని మూవీ వ‌ర్గాలంటున్నాయి. య‌శోద స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ. కాగా జిన్నా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌.

, , , , , , ,