అభిమానం హద్దులు దాటితే అభిప్రాయాలు కూడా రుద్దడం మొదలుపెడతారు. తాము ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అవతలి వారు అలాగే ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ఇవి హుందాగా ఉంటే ఫర్వాలేదు. బట్ చాలాసార్లు పరిధిలు మించి కనిపిస్తుంటాయి. కొన్నాళ్ల క్రితం అక్కినేని నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది ఆమెపై తమ అభిప్రాయాలనే రుద్దాలని చూశారు. తప్పంతా సమంతదే అంటూ తీర్మానాలూ చేశారు. కొందరైతే ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేశారు. ముఖ్యంగా వెబ్, డిజిటల్ మీడియంలో అసత్యమైన, అసభ్యమైన రాతలు రాశారు. ఆమె కోణం నుంచి కాకుండా తమ కోణంలోనే తీర్పులు ఇచ్చారు. అన్నేళ్లు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుని నాలుగేళ్ల కాపురం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు అంటే దానికి ఖచ్చితంగా వారి కారణాలు వారికి ఉంటాయి. పైగా ఇద్దరూ హుందాగానే విడిపోయారు. మా బతుకు మేం బతుకుతాం.. వదిలేయండి అని చెప్పారు. ఊహూ.. వింటేనా వినలేదు. ఇలా ఇస్టం వచ్చిన రాసుకున్నారు. ఈ విషయంలో సమంత చాలాసార్లు తనదే తప్పంతా అనడం గురించి మాట్లాడింది.

కానీ చైతన్య ఎప్పుడూ నోరువిప్పలేదు. కొందరు దీన్ని బాధితులే అరుస్తారు.. బాధించినవాళ్లు కామ్ గా ఉంటారు అనేలా కూడా మాట్లాడి కొంత సమంత వైపు వకాల్తా తీసుకున్నారు.ఇదంతా జనం మర్చిపోతోన్న టైమ్ లో సమంత సడెన్ గా తనకు మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి సోకిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఆమెకు సానుభూతిగా వందలాది మెసేజ్ లు, పోస్ట్ లతో అదే మీడియా హోరెత్తిపోయింది. అదే టైమ్ లో సమంత విడిపోయినప్పుడు తప్పంతా తనదే అన్నట్టుగా చూసిన జనం.. ఇప్పుడు ఆమె బాధలో ఉన్నా పరామర్శకు వెళ్లలేదని నాగ చైతన్యను కూడా ఆడిపోసుకుంటున్నారు. బట్ సమంత అంత కాదు. ఇక ఇప్పుడు సమంతకు సమాజంలో తిరుగులేని సానుభూతి కూడా లభిస్తోంది.

అలాగని తను ఈ సింపతీ కోసం ఆ పోస్ట్ చేయలేదు. తనకు సంబంధించిన ప్రతిదీ పంచుకోవడం అనే అలవాటు తనకు ముందు నుంచీ ఉంది. దాని వల్లే అప్పట్లో తన ఫోటోస్, వీడియోస్ ను సోషల్ మీడియాలో పెట్టినప్పుడు కూడా కొందరు కుహనా సంప్రదాయవాదులు ఆమెను తిట్టేసుకున్నారు. అదే జనం ఇప్పుడు ఆమెపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరైనా బాధలో ఉంటే ఇలా .. తామేదో అద్భుతమైన ఉపకారం చేశాం ఆమెకి అని ఫీలవుతున్నారు. బట్.. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ పబ్లిక్ లైఫ్ లో ఉన్నవాళ్లైనా పర్సనల్ లైఫ్ లో ఉన్నవాళ్లనైనా వారి కోణంలో చూడలేకపోతే పోయారు. కానీ ఎవడికి తోచింది వాడు మాట్లాడితేనే ఇబ్బంది.కొసమెరుపేంటంటే.. ఇప్పుడు నాగ చైతన్య పై పడ్డారు జనం.. ఏమనీ.. మళ్లీ సమంతతో కలిసి ఉండాలని. ఇద్దరూ మళ్లీ కలిస్తే మేం ఆనందిస్తాం అంటూ అన్నీ వీడియోస్ లో కమెంట్స్ చేస్తున్నారు. వీళ్ల ఆనందం కోసం వాళ్లు కలవడం ఏంటో మరి బుర్ర తక్కువ జనాలు.

, , ,