Advertisement
సెక్సీగా క‌నిపించ‌డం చాలా క‌ష్టం అంటున్న స‌మంత‌
Latest Movies Trending News

సెక్సీగా క‌నిపించ‌డం చాలా క‌ష్టం అంటున్న స‌మంత‌

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్.. కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో స‌మంత ఐటం సాంగ్ చేయ‌డం తెలిసిందే. అయితే.. పుష్ప సినిమా చూసిన వాళ్లంద‌రూ బ‌న్నీ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో.. స‌మంత గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. స‌మంత ఐటం సాంగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ లు.. రీట్వీట్స్.. కామెంట్స్ వస్తున్నాయి. వాటిలో కొన్నింటికి ఈమోజీలతో స్పందించిన సమంత మొదటిసారి తన‌ పాట గురించి స్పందించింది.

ఇన్ స్టాగ్రామ్ లో పుష్పలోని తన ఐటెం సాంగ్ స్టిల్ ను షేర్ చేసి… ఇప్పటి వరకు నేను చాలా మంచి పాత్రలు చేశాను.. చెడ్డ పాత్రల్లో నటించాను.. నేను ఫన్నీ పాత్రలు చేశాను.. సీరియస్ గా ఉన్న పాత్రలు చేశాను.. నేను ఒక షో కు హోస్ట్ గా కూడా చేశాను.. నేను ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ప్రేక్షకులకు కనిపించాను. వాటన్నింటి కోసం నేను చాలానే కష్టపడ్డాను కానీ.. ఇలా సెక్సీగా కనిపించడం మాత్రం చాలా కష్టం… నెక్ట్ లెవల్ హార్డ్ వర్క్ మరియు కష్టం అన్నట్లుగా సమంత పోస్ట్ పెట్టింది.

ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ కు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. సమంత పుష్ప లో ఐటెం సాంగ్ చేసిన నేపథ్యంలో ముందు ముందు ఆమె నుండి మరిన్ని ఐటెం నెంబర్స్ ను ఆశించవచ్చు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కానీ.. స‌మంతని ఈ సినిమాలో ఐటం సాంగ్ చేయ‌డానికి ఒప్పించ‌డం క‌ష్ట‌మైంద‌ని సుకుమార్ చెప్పారు. దీనిని బ‌ట్టి స‌మంత ఇక ఐటం సాంగ్స్ లో న‌టించ‌క‌పోవ‌చ్చేమో అనిపిస్తుంది.

Advertisement