ఆ మ‌ధ్య కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో పాల్గొన్నారు స‌మంత‌. అప్పుడు ఆమె డైవ‌ర్స్ గురించి, రిలేష‌న్‌షిప్స్ గురించి మాట్లాడిన మాట‌లు వైర‌ల్ అయ్యాయి. దాంతో ఏమ‌నుకున్నారో ఏమోగానీ మీడియాకు మాత్రం దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లు ఆ సైలెన్స్ ని భ‌రించిన మీడియా, అస‌లు స‌మంత‌కు ఏమైంది? అని రాయ‌డం మొద‌లుపెట్టింది. ఇంకొంద‌రైతే, ఇంకో స్టెప్ ముందుకేశారు. గ‌తంలో స‌మంత‌ను బాధించిన స్కిన్ డిసీజ్ మ‌ళ్లీ వ‌చ్చింద‌ని, అందుకే ఆమె సైలెంట్ అయ్యార‌ని రాశారు. కానీ అవ‌న్నీ ఒట్టిమాట‌లే అని గ‌ట్టి కౌంట‌రే ఇచ్చారు స‌మంత మేనేజ‌ర్‌.


ఆమె న‌టించిన య‌శోద టీజ‌ర్ రిలీజ్ కావ‌డంతో మ‌ళ్లీ ఒక్క‌సారిగా నేష‌న‌ల్ వైడ్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చేశారు స‌మంత‌. ఆ సినిమా ప్ర‌మోష‌న్లు కాస్త స‌ర్దుమ‌ణ‌గ‌డంతో త‌మ శాకుంత‌లం గురించి మాట్లాడుతున్నారు డైర‌క్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌.


క‌ణ్వ మ‌హ‌ర్షి ఆశ్ర‌మంలో పెరిగిన శ‌కుంత‌ల క‌థ‌తో తెర‌కెక్కింది శాకుంత‌లం. పౌరాణిక గాథ‌లో శ‌కుంతల పాత్ర‌లో ఒదిగిపోయారు స‌మంత‌. అతి త్వ‌ర‌లోనే ఆమె ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేస్తార‌ని అనౌన్స్ చేశారు డైర‌క్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌.


శాకుంత‌లం కోసం స‌మంత మాత్ర‌మే కాదు, అల్లు అర్జున్ కూడా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ త‌న‌య అల్లు అర్హ ఈ సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇస్తున్న బేబీ అర్హ కోసం అల్లు ఆర్మీ అంతా వెయిటింగ్‌.


మ‌రోవైపు త‌న బాలీవుడ్ వెబ్‌సీరీస్ ప‌నుల్లో ఉన్నారు స‌మంత‌. దీంతో పాటు మిగిలిన ప్రాజెక్టులు అన్నిటినీ కంప్లీట్ చేసుకుని, నెక్స్ట్ ఇయ‌ర్ ఈ పాటికి ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ సెట్స్ లోకి వెళ్లాల‌న్న‌ది ఆమె ప్లాన్‌.

, , , , , ,