పుష్ప సినిమాలో ఒక్క పాట‌తోనే దేశ‌వ్యాప్తంగా ఓ రేంజ్ క్రేజ్ వ‌చ్చేలా చేసింది స‌మంత‌. ఊ అంటావా మావా అంటూ త‌న సిజిలింగ్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. పైగా ఈ పాట త‌న‌కు అఫీషియ‌ల్ గా డివోర్స్ అయిన త‌ర్వాత రావ‌డంతో సినిమాకూ అనూహ్య‌మైన క్రేజ్ వ‌చ్చింది. త‌ర్వాత కూడా త‌న‌కు అలాంటి ఆఫ‌ర్స్ చాలానే వ‌చ్చినా ప‌ట్టించుకోలేదు.

ప్ర‌స్తుతం ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉంది. ఎప్పుడో పూర్త‌యిన శాకుంత‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉంది. బైలింగ్వుల్ గా వ‌స్తోన్న య‌శోద కూడా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ తో న‌టిస్తోన్న ఖుషీ సినిమా మాత్రం ఇంకా షూటింగ్ ఉంది. అయితే కొన్నాళ్లుగా త‌న‌కు స్కిన్ కు సంబంధించిన స‌మ‌స్య‌లేవో ఉన్నాయ‌ని రూమ‌ర్స్ వ‌స్తున్నాయి.

అది నిజ‌మా కాదా అనేది ప‌క్క‌న బెడితే చాలా రోజుల త‌ర్వాత త‌ను సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం వ‌చ్చేసింది. మ‌రోవైపు బాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్ ల‌పైనా ఫోక‌స్ చేస్తోన్న స‌మంత‌కు అనుకోని అవ‌కాశం వ‌చ్చిందంటున్నారు.


పుష్ప‌2లో త‌న‌కు మ‌రో పాట‌తో పాటు ఓ పాత్ర కూడా ఉంటుంద‌ని టాక్. ఈ పాత్ర‌కు సుకుమార్ చాలా ప్ర‌త్యేకంగా డిజైన్ చేశాడ‌ని.. ప్రేక్ష‌కులెవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ను త‌ను ఇస్తుంద‌ని.. ఆ పాత్రే పుష్ప రాజ్ సామ్రాజ్యం సైతం ప‌త‌నం అవుతుందంటున్నారు.

సెకండ్ హాఫ్ లో త‌న పాత్ర మ‌రోసారి స్పెష‌ల్ సాంగ్ తో ఎంట‌ర్ అవుతుంద‌ట‌. ఆ త‌ర్వాత త‌న రోల్ కంటిన్యూ అయ్యి.. చివ‌రి అర‌గంట‌లో త‌న పాత్ర ఇచ్చే ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంద‌నే టాక్ సుక్కూ టీమ్ నుంచి లీక్ అయిన‌ట్టు స‌మాచారం.

అయితే పెద్ద సినిమాల‌కు సంబంధించి ఇలాంటి లీకులు కామ‌న్. కానీ కొన్ని లీకులు నిజ‌మైన సంద‌ర్బాలూ ఉన్నాయి. అలా ఈ వార్త కూడా నిజ‌మ‌వుతుందా లేక రూమ‌ర్ గానే ఆగుతుందా అనేది చూడాలి.

, , , , , , , , , , , ,