Advertisement
చిరు కోసం రంగంలోకి దిగ‌నున్న స‌ల్మాన్*
Bollywood Latest Movies Tollywood

చిరు కోసం రంగంలోకి దిగ‌నున్న స‌ల్మాన్*

Advertisement

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్నారు. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన లూసీఫ‌ర్ చిత్రానికి రీమేక్ గా చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీ చేస్తున్నారు. దీనికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే.. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ న‌టిస్తుండ‌డం విశేషం. లూసీఫ‌ర్ మూవీలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర‌ను తెలుగులో స‌ల్మాన్ ఖాన్ చేస్తుండ‌డం విశేషం.

త్వ‌ర‌లోనే స‌ల్మాన్.. గాడ్ ఫాద‌ర్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం స‌ల్మాన్ టైగ‌ర్ 3 మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. దీంతో ఆ డేట్స్ ను గాడ్ ఫాద‌ర్ మూవీ కోసం కేటాయించిన‌ట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో గెస్ట్ రోల్ తో పాటు ఓ పాట‌లో చిరుతో క‌లిసి స‌ల్మాన్ డ్యాన్స్ చేయ‌నున్నారు. దీని కోసం 5 నుంచి 7 రోజులు డేట్స్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

క‌రోనా కార‌ణంగా షూటింగ్ ల‌కు ఎలాంటి ఆంక్ష‌లు పెట్ట‌క‌పోతే… జ‌న‌వ‌రి నెలాఖరున ఈ షెడ్యూల్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మ‌రి.. గాడ్ ఫాద‌ర్ గా చిరంజీవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Advertisement