ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా సలార్. కెజీఎఫ్‌ తో దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. అయితే ఓ వైపు ఈ ప్రాజెక్ట్ చేస్తూనే మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు ప్రభాస్. వీటిలో ముందుగానే పూర్తయిన ఆదిపురుష్ కూడా ఉంది. ఆదిపురుష్ మూవీకి సంబందించి ఇంకా చాలా రీ షూట్స్ జరగబోతున్నాయి. అందుకే ఈ మూవీని 2023లో కాక 2024లో విడుదల చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఆదిపురుష్‌ తర్వాత రావాల్సిన సలార్ దానికంటే ముందే రాబోతోంది. ఇక అశ్వనీదత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ప్రాజెక్ట్ కే తో మరో భారీ మూవీతో వస్తున్నాడు. అటు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ కూడా ఉండబోతోంది. ఇవన్నీ 2024లోనే విడుదలవుతాయి. వాటికి ముందు సలార్ ఉంది. ప్రస్తుతానికి వచ్చే యేడాది సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నామని ముందే అనౌన్స్ చేశారు.


సలార్ కు సంబంధించి ఎప్పటి నుంచో వినిపిస్తోన్న మాట ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని. అయితే ఈ సీక్వెల్ కు సంబంధించి కూడా ఇప్పుడే చాలా వరకూ షూటింగ్ చేస్తున్నారనే టాక్ ఉంది. అంటే ఒకేసారి రెండు భాగాల చిత్రీకరణ జరుగుతోందన్నమాట. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉందంటున్నారు. సలార్ కు సీక్వెల్ అనేది కెజీఎఫ్‌ ఫార్మాట్ లో ఉంటుందట.

అంటే కెజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిన తర్వాతే సెకండ్ పార్ట్ కు సిద్ధమయ్యారు. ఇప్పుడు సలార్ కూడా సూపర్ హిట్ అయితేనే సీక్వెల్ ను పూర్తి చేస్తారట. అంటే సలార్ కూడా కెజీఎఫ్‌ లా దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయితేనే సీక్వెల్ ఉంటుందన్నమాట. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన పాత్రలో మళయాల స్టార్ పృథ్వీరాజ్ నటిస్తున్నాడు. అవుట్ అండ్ యాక్షన్‌ ఎంటర్టైనర్ లా.. పూర్తిగా ప్రశాంత్ నీల్ మార్క్ లో వస్తోన్న సలార్ విజయంపై సీక్వెల్ ఆధారపడి ఉంటుందన్నమాట.

, , , , , , , , , , , , ,