Advertisement
కమల్ హాసన్ తో సాయి పల్లవి..
Latest Movies Tollywood

కమల్ హాసన్ తో సాయి పల్లవి..

Advertisement

ఫస్ట్ మూవీకే బెస్ట్ యాక్ట్రెస్ అనిపించుకున్న బ్యూటీ సాయి పల్లవి. మళయాలంలో చేసిన ప్రేమమ్ తో వెలుగులోకి వచ్చిన ఈ డాక్టర్ కమ్ డ్యాన్సర్.. ఆ సినిమాలో మలర్ అనే పాత్రలో అద్భుతంగా నటించి మళయాలీల మనసు దోచుకుంది. చాలా నేచురల్ బ్యూటీ అనిపించుకున్న సాయి పల్లవి నేచురలర్ గానే మన నేచురల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములను అట్రాక్ట్ చేసింది. ఇంకేం.. వెంటనే తన ఫిదా సినిమాలో కాస్టింగ్ చేశాడు. శేఖర్ నమ్మకం వమ్ము కాలేదు. ఫిదా సినిమా అంతే సింగిల్ హ్యాండ్ తో లాగించింది సాయిపల్లవి. తన నటన, డ్యాన్స్ లతో తెలుగు ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోన్న సాయి పల్లవి రీసెంట్ గా మరోసారి శేఖర్ తోనే చేసిన లవ్ స్టోరీతో మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం తను మాత్రమే చేయదగిని పాత్రలా విరాటపర్వంతో రాబోతోంది. ఈ చిత్రం జూలై1న విడుదల కాబోతోంది. విరాటపర్వంపైనా చాలా అంచనాలున్నాయి. ఈ టైమ్ లో తను తమిళ్ లో కమల్ హాసన్ సినిమాలో నటించబోతోంది అంటే ఆశ్చర్యమేం ఉంది.

కమల్ నటుడుగానే కాదు.. నిర్మాతగానూ అందరికీ తెలుసు కదా.. తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఓ సినిమా నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రలోనే సాయి పల్లవి నటించబోతోంది. ఈ విషయం కమల్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. కాకపోతే ఈ చిత్రంలో కమల్ నటించడం లేదు. కేవలం నిర్మిస్తున్నాడు. ఓ కొత్త దర్శకుడ పరిచయం కాబోతోన్న ఈ సినిమా కూడా సాయి పల్లవి టేస్ట్ కు తగ్గట్టుగా ఆమె నటనను ఎలివేట్ చేసేలానే ఉంటుందంటున్నారు. ఇక ఈ విషయాన్ని సాయి పల్లవి కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కమల్ సర్ తో మాట్లాడిన తర్వాత తన నటన ఇంకా మెరుగవుతుంది అంటూ.. తర్వాత కమల్ కూడా ఆమెను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. నీ నటనతో మా బ్యానర్ లో ఓ మంచి సినిమాను చేసి దర్శకుడుకి ధైర్యాన్ని ఇవ్వాలి అంటూ పెద్ద మాటే అనేశాడు కమల్. అంటే అతనికీ సాయి పల్లవి టాలెంట్ అంటే ఎంత ఇష్టమో అర్థమౌతోంది కదా..? మర ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Post Comment