సౌత్ లో ఇప్పుడు నటనతో అద్భుతమైన సత్తా ఉన్న హీరోయిన్ల లిస్ట్ తయారు చేస్తే ఫస్ట్ వచ్చే పేరు సాయి పల్లవి. స్కిన్ షోకు దూరంగా టాప్ హీరోయిన్ అనే ట్యాగ్ ను సంపాదించుకుంది. తను ఒకప్పుడు సావిత్రి, సౌందర్య తర్వాత ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. అది కూడా అతి తక్కువ టైమ్, సినిమాలతో. ఫస్ట్ మూవీ ప్రేమమ్ తో మాలీవుడ్ ను, ఫస్ట్ తెలుగు మూవీ ఫిదాతో టాలీవుడ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి.. ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ లో అయినా సూట్ అవుతా అనిపించుకుంది.

అదే టైమ్ లో పడిపడి లేచె మనసు, లవ్ స్టోరీ వంటి సినిమాల్లోనూ సత్తా చాటింది. ప్రస్తుతం కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు తను. అయినా ఈ మధ్య సాయి పల్లవి బాలీవుడ్ కు వెళుతోంది అనే ప్రచారం మొదలైంది. ఇండస్ట్రీలో ఇవి కామనే కానీ.. తను వెళుతోన్న పాత్ర గురించి తెలిస్తే ఖచ్చితంగా ఇది రూమరే అంటారు.
సాయి పల్లవి టాలెంట్ కు బాలీవుడ్ ఏంటీ.. హాలీవుడ్ కు వెళ్లినా ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడు వినిపిస్తోన్న రూమర్ లో తను బాలీవుడ్ లో రామాయణం కథ చేయడానికి వెళుతోందనీ.. అందులో సీత పాత్రకు తనను తీసుకున్నారనీ, రాముడు పాత్ర రణ్‌వీర్ సింగ్ చేస్తున్నాడనీ.. చెబుతున్నారు.

ఇక్కడే ఇది రూమర్ అని తేలిపోతుంది. రామాయణం లాంటి కథను తీయాలనుకున్నఅల్లు అరవిందే దాని గురించి చాలాసార్లు చెబుతూ వస్తున్నాడు. ఇంకా సెట్ కావడం లేదనీ.. ఎవరు ఏ పాత్ర చేయాలనే దానిపైనా.. దర్శకుడి గురించి ఇలా అనేక సవాళ్లున్నాయి అంటున్నాడు. అలాంటిది.. మైథలాజికల్స్ తీయడంలో పూర్ అనిపించుకున్న బాలీవుడ్ లో ఈ వార్త హాట్ టాపిక్ కాకుండా ఉంటుందా..? సాయిపల్లవి మేటర్ అలా ఉంచితే అసలు ప్రాజెక్ట్ గురించి ఎన్ని వార్తలు వచ్చేవి.. ? ఒక్కటీ లేదు. అంటే సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణం చేయడం లేదు అనేది తేలిపోయింది.


ఇక బాలీవుడ్ లోనే ఇంకేదైనా సినిమా వస్తే తనే చెబుతుంది కదా..? పల్లవి అందరి లాంటి పిల్ల కాదు. సింగిల్ పీస్. అందుకే తను చెప్పే వరకూ ఇట్టాంటి రూమర్స్ ను ఆపుకుంటే మంచిది..

, , , , , , , , , , , , ,