అశోక్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై రవితేజ మహాదాస్యం, విషిక హీరో హీరోయిన్ గా కేన్స్ లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ఫిలిం ఫెస్టివల్ లో తన ప్రతిభను చాటుకూన రాజశేఖర్ సుడ్మూన్ దర్శకత్వంలో అశోక్ మిట్టపల్లి నిర్మిస్తున్న చిత్రం “సగిలేటి కథ”. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్రీకరించబడిన “ఒక అందమైన మట్టి కథ అక్కడి మనుషుల కథ” . ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను యూనిట్ సభ్యులు సోషల్ మీడియా లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు ఇటువంటి నేటివిటీని ఎప్పుడు చూసి ఉండరు. ఈ చిత్రంలోని  భావోద్వేగాలు మిమ్మల్ని కదిలిస్తాయి, ఇంకా చెప్పాలి అంటే ఇందులో పాత్రలతో మీరు మాట్లాడబోతున్నారు అనడంలో అతిశయోక్తి  ఏమాత్రం లేదు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి పాత్ర ఒక కల్ట్ పాత్ర. ఒక అద్భుతమైన రాయలసీమ కథను త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాము” అని తెలిపారు.

, , , , , ,