ad

కోల్పోయిన లవర్ ను తలచుకుని చెలియ లేదు చెలిమి లేదు అని పాడుకున్నాడో దేవదాసు.. మరీ దేవదాసు రేంజ్ కాదు కానీ.. ఇప్పుడు దర్శకుడు హరీశ్ శంకర్ కూడా అలాంటి ఎదురుచూపుల్లోనే కొట్టుమిట్టాడుతున్నాడు. వెళ్దామంటే హీరో నిర్మాతలకి కోపం.. ఉందామంటే తనకు విలాపం. దీంతో ఎటూ తేల్చుకోలే తెగ ఇదైపోతున్నాడీ టాలెంటెడ్ డైరెక్టర్. షాక్ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యి.. మిరపకాయ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ తో మనోడు ఓవర్ నైట్ టాప్ డైరెక్టర్ అయ్యాడు. గబ్బర్ సింగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కూడా ఆ రేంజ్ దే. బట్ ఆ తర్వాత అతను ఆ రేంజ్ హిట్ మళ్లీ కొట్టలేదు. పెద్ద హీరోలు ఛాన్స్ ఇచ్చినా పాడు చేసుకున్నాడు. మీడియం రేంజ్ లో హీరోలతో విజయాలు సాధించి మళ్లీ పవన్ కళ్యాణ్ ను మెప్పించాడు. నిజానికి పవన్, హరీశ్ కాంబో కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. పైగా పపన్ ఇప్పుడు చేస్తోన్న సినిమాలేవీ పవర్ ప్యాక్డ్ గా లేవు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అంటూ సాఫ్ట్ కోర్ మూవీస్.

అందుకే అతన్నుంచి ఓ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ కోసం చూస్తోన్న ఫ్యాన్స్ కు హరీశ్ అయితే ఆ లోటును తీర్చుతాడు అనే నమ్మకం ఉంది. వారి నమ్మకం నిజం చేస్తా అంటూ హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ తో ‘‘భవదీయుడు భగత్ సింగ్’’ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు. ఇంకేముందీ మరో గబ్బర్ సింగ్ వచ్చేస్తోందీ అనుకున్నారు అభిమానులు. దీనికంటే ముందు కరోనా వచ్చింది. ఆ తర్వాత భీమ్లా నాయక్ వచ్చింది. కానీ ఈ రెండిటికీ ముందే ఒప్పుకున్న హరిహర వీరమల్లు కూడా ఇంకా పూర్తి కాలేదు. అదయ్యాకైనా తనకు టైమ్ ఇస్తాడు అనుకుంటే ఈ లోగా మరో తమిళ్ మూవీని రీమేక్ చేయబోతున్నాడు.

దీంతో పాపం హరీశ్ శంకర్ కక్కలేక మింగలేక ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ మూవీ వర్కింగ్ స్టిల్స్ ను అదే పనిగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ తో ఇన్ డైరెక్ట్ గా తన బాధను చెప్పుకుంటున్నాడు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కూడా ఇలా దర్శకుల కోసం కాకపోయినా ఆయా సినిమాల నిర్మాతల గురించి ఆలోచించాలి. వాళ్లు తెచ్చుకున్న డబ్బులకు వడ్డీలే డబుల్ అవుతుంటాయి. పోనీ సినిమా స్టార్ట్ అయినా దాన్ని భరించొచ్చు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియకుండా ఇలా వెయిటింగ్ లో పెడితే ఇటు దర్శకుడు టైమ్.. అటు నిర్మాత మనీ లాస్ అవుతాడు. పోనీ ఇవన్నీ వెనక్కి తెచ్చే సత్తా పవన్ లో ఉందా అంటే ఆ టైమ్ కు జగనన్న మూడ్ ఎలా ఉంటుందో చెప్పలేం.. మరంచేత కుంచె పవన్ కళ్యాణ్ గారే మనసు పెద్దది చేసుకుని ముందు ఒప్పుకున్న సినిమాల ఆర్డర్ ప్రకారంగానే చేస్తే బావుంటుందేమో..

, , , , , , , ,