వెళ్ల‌వ‌య్యా వెళ్లూ అంటూ మెడ కాస్త వంచి, చేయి చాపి అదో రిథ‌మ్‌లో చెప్పిన జ‌యం స‌దా గుర్తుందా? ఆ త‌ర్వాత కూడా చాలా సినిమాల్లో న‌టించింది స‌దా. ఈ మ‌ధ్య‌యితే రియాలిటీ షోల‌కు జ‌డ్జిగా వెళ్తూ అంద‌రికీ డ్యాన్స్ టిప్స్ కూడా చెబుతోంది.


జ‌స్ట్ రియాలిటీ షోల షూటింగుల‌కే కాదు, వైల్డ్ లైఫ్ కెమెరా మెడ‌లో వేసుకుని రియ‌ల్ టైగ‌ర్స్ ని క్లిక్ చేయ‌డానికి కూడా బ‌య‌లుదేరుతోంది స‌దా. రీసెంట్‌గా మ‌హ‌రాష్ట్ర‌లోని ఓ వన్య‌మృగశ‌ర‌ణాల‌యానికి వెళ్లింది స‌దా. అక్క‌డ నాలుగు రోజులు వ‌రుస‌గా స‌ఫారీ చేసింది. ఆ క్ర‌మంలోనే ఆమెకు ప‌ర‌శు అనే పులి తెగ న‌చ్చింద‌ట‌. ఆ నాలుగు రోజులూ ఆ పులిని ర‌క‌ర‌కాలుగా ఫొటోలు తీసుకుంద‌ట స‌దా.


ఎక్క‌డికెళ్లినా పెద్ద‌గా అటాచ్‌కాని స‌దా, ఈ సారి మాత్రం ప‌ర‌శు మీద మ‌న‌సుప‌డింద‌ట‌. కాక‌పోతే మ‌ళ్లీ మ‌ళ్లీ వెళ్లి చూడాలంటే కుద‌ర‌ద‌ని వ‌చ్చేసిందట‌. ఇంటికి వ‌చ్చాక కూడా ప‌ర‌శు జ్ఞాప‌కాలే వెంటాడాయ‌ట స‌దాని. త‌నకి ఎవ‌రు క‌నిపించినా ఆ పులి గురించే చెప్ప‌డం మొద‌లుపెట్టింద‌ట‌.

స‌రిగ్గా ఇదే టైమ్‌లో ఆమె ఫ్రెండ్స్ గ్యాంగ్ వన్య‌మృగ శ‌ర‌ణాల‌యానికి వ‌స్తావా? అని అడ‌గ‌డంతో ఎగిరి గంతేసి మ‌రీ వెళ్లిపోయింద‌ట స‌దా. ఈ బ్యూటీ చెప్పిన ఈ విష‌యం ఇప్పుడు కోలీవుడ్‌లో తెగ వైర‌ల్ అవుతోంది.


జ‌యం, అప‌రిచితుడు సినిమాల టైమ్‌లో ఎలా ఉందో, ఇప్ప‌టికీ అలాగే ఉంది స‌దా. పెళ్లి మాటేంటి? అని ఎవ‌రైనా అడిగితే, జ‌ర‌గాల్సిన‌ప్పుడు దానంత‌ట అదే జ‌రుగుతుంది. టెన్ష‌న్ క్యూ అంటూ స‌ర‌దాగా మాట దాటేస్తుంది ఈ బ్యూటీ.

, , , , ,