తను టాప్ హీరోయిన్. రీసెంట్ గానే పర్సనల్ లైఫ్‌ మేటర్స్ తో దేశవ్యాప్తంగా చర్చల్లో నలిగిపోయింది. అయితేనేం తన పనేదో తను చేసుకుంటూ మళ్లీ కెరీర్ ను గాడిన పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉంది. బట్ సడెన్ గా ఆ మొత్తం కట్ అయిపోయాయి. సోషల్ మీడియాలోనే కాదు.. ఏ మీడియంలోనూ కనిపించడం లేదు. దీంతో రకరకాల రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. మరి తనకు ఏమైందీ..సమంత.. మొదట్నుంచీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించిన లేడీ. పెళ్లి, విడాకులు టైమ్ లో కూడా తను ఆ మాధ్యమాన్ని వదల్లేదు. తనపై వచ్చే రూమర్స్ కు కౌంటర్స్ ఇచ్చింది. తనను అభిమానించే వారికి లవ్ సింబల్సూ పంపించింది.

అలాంటి తను సడెన్ గా సోషల్ మీడియాలోనూ కనిపించడం మానేసింది. ఇలా మాయం కావడానికి ముందు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా షూటింగ్ లో ఉంది. ప్రస్తుతం తన అబ్సెన్స్ తో ఆ షూటింగ్ కూడా ఆగిపోయింది. మరోవైపు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ సైతం హోల్డ్ లో పడిపోయాయి. ఇటు ప్యాన్ ఇండియన్ మూవీ యశోద ప్రమోషన్స్ కూడా అటకెక్కాయి. దీంతో సమంతకు ఏదో అయిపోయిందనే వార్తలు ఓ రేంజ్ లో హల్చల్ చేశాయి. వీటి విషయంలో ఫీల్ అయిన శామ్ ఆ మధ్య సదరు వెబ్ సైట్స్ పై కేస్ కూడా వేయాలనుకుందట. ఇక్కడే చాలామందికి డౌట్స్ మరింత పెరిగాయి.సమంతకు ఏదో స్కిన్ అలర్జీ వచ్చిందనీ.. అందుకే తను బయట కనిపించడం మానేసిందనేది రెగ్యులర్ గా వినిపిస్తోన్న రూమర్.

ఈ విషయాన్ని ఖండించి నేనే బానే ఉన్నా అని తను ఓ మాట చెబితే అయిపోతుంది. అలా కాకుండా ఇలా చెప్పిన వారిపై కేస్ లు వేస్తా అనడంతోనే అసలు సమస్య కనిపిస్తోంది. సో.. సమంతకు స్కిన్ ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది పక్కన బెడితే.. ఇంకేదో సమస్య అయితే ఉండే ఉంటుందంటున్నారు చాలామంది. అది తన హెల్త్ ఇష్యూ కావొచ్చు.. లేదా ఏదైనా మానసిక సమస్యైనా కావొచ్చు. లేదూ ఏమీ లేకపోవచ్చు. కానీ ఇలా దోబూచులాడితే ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడేసుకుంటారు. కేస్ లైనా.. ఇంకేదైనా ఎంతమందిపై పెడతారు అనేది కొందరి వాదన. ఏదేమైనా సమంత వల్లే ఇప్పుడు ఖుషీ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. మరి ఈ వ్యవహారం తేలాలంటే సమంతే ఏదో ఒకటి చెప్పాలి. లేదంటే రూమర్ రాయుళ్లు ఇంకా రెచ్చిపోతూనే ఉంటారు.

, , , ,