Advertisement
ప్రముఖ హీరో దగ్గర పట్టుబడిన రూ.410 కోట్లు
Latest Movies Tollywood

ప్రముఖ హీరో దగ్గర పట్టుబడిన రూ.410 కోట్లు

Advertisement

మనీ లాండరింగ్ కేసులో మరోసారి వార్తల్లోకి ఎక్కారు హీరో, నిర్మాత సచిన్ జోషి. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సచిన్ జోషి, టెంపర్ లాంటి కొన్ని పెద్ద చిత్రాలకు షాడో ప్రొడ్యూసర్ గా పెట్టుబడులు పెట్టారు. సినిమాల మీద ఆసక్తితో పరిశ్రమకు వచ్చిన సచిన్ జోషి కెరీర్ పరంగా వ్యాపారవేత్త. ఆయన ఓంకార్ గ్రూప్ ముంబై సహా అనేక నగరాల్లో రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు చేస్తుంటుంది. సచిన్ జోషి వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది వ్యాపారంలోనే

రెండేళ్ల కిందట సచిన్ జోషి మీద మనీ లాండరింగ్ కేసు నమోదైంది. లోన్లు ఇవ్వడంలో నియమాలు ఉల్లంఘించారంటూ 2020 లో ఔరంగాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సుప్రీం దాకా వచ్చిన ఆ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. మధ్యలో బెయిల్ పై సచిన్ బయటకొచ్చారు. దర్యాప్తు జరిపిన ఈడీ సచిన్ జోషి 410 కోట్ల మేర అవకతవకలు జరిపాడని తేల్చారు. దీంతో ఈ మొత్తం 410 కోట్ల రూపాయలను ఓంకార్ గ్రూప్ తో పాటు మరో సంస్థ నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.

Advertisement