Advertisement
ప్రేక్షకులకు రూ.10 లక్షల బంఫర్ ఆఫర్
Latest Movies Tollywood

ప్రేక్షకులకు రూ.10 లక్షల బంఫర్ ఆఫర్

Advertisement

తన సినిమా చూసి పులి (విలన్) ఎవరో కనుక్కుంటే 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామంటున్నారు ఓ చిన్న సినిమా దర్శకుడు. ఆ సినిమా పేరు ‘పులి వచ్చింది మేక సచ్చింది’. దర్శకుడు అ శేఖర్ యాదవ్. ప్రపంచపు తొలి 360 డిగ్రీల సినిమాను రూపొందించానని చెప్పుకుంటున్న ఈ దర్శకుడు పుష్ప మూవీతో పోటీ పడుతూ ఈ నెల 17న సినిమాను విడుదల చేస్తున్నాడు. వాస్తవానికి ఈ డేట్ కు థియేటర్లు దొరక్కున్నా, ఒక్క స్క్రీన్ లో నా సినిమా పడినా చాలు అంటున్నాడు.

సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘పులి వచ్చింది మేక సచ్చింది’ సినిమాలో
జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి కీలక పాత్రల్లో నటించారు. ‘పులి వచ్చింది మేక సచ్చింది’. సినిమా రెండు పార్టులు ఉంటుందని రెండో పార్టు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతున్న జనవరి 7న విడుదల చేస్తానని దర్శకుడు చెప్పడం అసలు ట్విస్ట్. దర్శకుడు అ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ… పులి వచ్చింది మేక సచ్చింది సినిమా సస్పెన్స్ క్రైమ్ డ్రామా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు కరుడుగట్టిన నేరస్తుడికి మధ్య జరిగే కథ. ఈ సినిమాలో పులి ఎవరో చెబితే ప్రేక్షకులకు 10 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాం.అన్నారు.

Advertisement