Advertisement
“ఆర్ఆర్ఆర్” ప్ల‌స్ అండ్ మైన‌స్
Bollywood Latest Movies Regional Tollywood

“ఆర్ఆర్ఆర్” ప్ల‌స్ అండ్ మైన‌స్

Advertisement

ఆర్ఆర్ఆర్.. ఎవ‌రి నోట విన్నా ఇదే మాట‌. ఈ సినిమాని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అనే ఆస‌క్తిని అంద‌రిలో క‌లిగించారు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. దీనికి కార‌ణం క‌థ‌, క‌థానాయ‌కులు. క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా నంద‌మూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ ల‌ను ఒకే ఫ్రేములో చూపిస్తుండ‌డంతో ఆర్ఆర్ఆర్ పై అంచ‌నాలు ఆకాశాన్నితాకుతున్నాయి. ఇక ఈరోజు ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ అయితే.. భార‌తీయ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లారు. రాజ‌మౌళి.. మ‌రోసారి చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం అనిపిస్తుంది.

అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్ల‌స్ అండ్ మైన‌స్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే.. క‌థ‌, క‌థానాయ‌కులు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌ల‌వ‌ని ఆంధ్రా ప్రాంతానికి చెందిన‌ అల్లూరి సీతారామ‌రాజు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమ‌రం భీమ్ ని క‌లిస్తే ఎలా ఉండేదో చూపించే అద్భుత‌మైన క‌థ ఈ చిత్రానికి ప్ల‌స్ పాయింట్. ఇక ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టించ‌డం మ‌రో ప్లస్ పాయింట్. ఇక వీరిద్ద‌రి న‌ట అయితే.. విశ్వ‌రూపం చూపించేశార‌ని ట్రైల‌ర్ ను బ‌ట్టి తెలుస్తుంది.

జ‌క్క‌న్న యాక్ష‌న్ ఎపిసోడ్స్ చూస్తే.. హాలీవుడ్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ గుర్తొస్తాయి. యాక్ష‌న్ అండ్ ఎమోష‌న్ ని క‌ల‌గ‌లిపి ఆయ‌న చూపించే విధానం. కీర‌వాణి సంగీతం, సెంథిల్ కెమెరా వ‌ర్క్, సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు, బాలీవుడ్ యాక్ట‌ర్ అలియాభ‌ట్, అజ‌య్ దేవ‌గ‌న్, స‌ముద్ర‌ఖ‌ని.. వీళ్లంద‌రూ సినిమాకి ప్ల‌స్ పాయింట్స్. ఇక మైన‌స్ ఏంటంటే.. ర‌న్ టైమ్ మూడు గంట‌ల‌కు పైగా ఉంటుంది. ప్రెజెంట్ జ‌న‌రేష‌న్ కి ఓపిక త‌క్కువ‌. సినిమాల్లో పాట‌లు వ‌స్తుంటేనే ఓపిక లేక‌ బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నారు ఆడియ‌న్స్. అలాంటిది మూడు గంట‌ల‌కు పైగా థియేట‌ర్లో ఆడియ‌న్ ని కూర్చొబెట్టాలంటే.. కాస్త క‌ష్ట‌మే. కాక‌పోతే అక్క‌డ ఉన్న‌ది జ‌క్క‌న్న కాబ‌ట్టి ర‌న్ టైమ్ మైన‌స్ కాద‌నే వాద‌న వినిపిస్తోంది.

అయితే… ఆలియాభ‌ట్, అజ‌య్ దేవ్ గ‌న్ పాత్ర‌ల నిడివి త‌క్కువే అని స‌మాచారం. దీంతో నార్త్ ఆడియ‌న్స్ కి ఎంత వ‌ర‌కు న‌చ్చుతుందో అనే అనుమానాలు ఉన్నాయి. ఆలియా, అజ‌య్ పాత్ర‌ల‌ను మ‌రీ త‌క్కువుగా చూపిస్తే.. న‌చ్చ‌క‌పోవ‌చ్చు. అలాగే అల్లూరి సీతారామార‌జు, కొమ‌రం భీమ్ తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలుసు. నార్త్ ఆడియ‌న్స్ కి వీళ్ల గురించి తెలియ‌దు. అందువ‌ల‌న అంత‌గా క‌నెక్ట్ కాక‌పోవ‌చ్చు. సినిమాప‌రంగా మైన‌సులు ఇలా ఉంటే.. క‌రోనా థ‌ర్డ్ వేవ్ అంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌ధ్యంలో సౌత్ లో ఫ‌ర‌వాలేదు కానీ.. నార్త్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రో విష‌యం ఆంధ్రాలో టిక్కెట్ల రేట్లు త‌క్కువుగా ఉండ‌డం కూడా ఆర్ఆర్ఆర్ కు మైన‌స్. ఇన్ని ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో వ‌స్తున్న ఆర్ఆర్ఆర్.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Advertisement